Pabhas : ఖాళీ ఫుడ్ కవర్లు, లైటింగ్ ఎఫెక్ట్ తో ప్రభాస్ బొమ్మ.. ఎలా చేసాడో చూడండి..

ఓ విదేశీ ప్రభాస్ అభిమాని ఖాళీ ఫుడ్ కవర్లతో ప్రభాస్ బొమ్మ వచ్చేలా భలే డిజైన్ చేసాడు.

Pabhas : ఖాళీ ఫుడ్ కవర్లు, లైటింగ్ ఎఫెక్ట్ తో ప్రభాస్ బొమ్మ.. ఎలా చేసాడో చూడండి..

Prabhas Fan Designed an Art with Waste Empty Covers it shows Prabhas photo while lighting

Updated On : July 17, 2024 / 9:26 AM IST

Pabhas : ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో 1000 కోట్ల భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కి మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా అభిమానులు ఎక్కువే. జపాన్ లో అయితే ప్రభాస్ సినిమాలు భారీగా రిలీజ్ అవుతాయి. అక్కడి ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా వస్తే ఓ రేంజ్ లో సందడి చేస్తారు. ప్రభాస్ ఫోటోలు, డిజైన్స్ తో హడావిడి చేస్తారు. ఇక పలువురు ఆర్టిస్టులు తమ ఆర్ట్ తో హీరోలు, సెలబ్రిటీల ఫేస్ వచ్చేలా ఆర్ట్ చేస్తారని తెలిసిందే.

Also Read : Ram Pothineni : యూట్యూబ్ రాకముందే హీరో రామ్ షార్ట్ ఫిలిం తీసాడని తెలుసా? కానీ రామ్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే..

ఇటీవల ఓ విదేశీ ప్రభాస్ అభిమాని ఖాళీ ఫుడ్ కవర్లతో ప్రభాస్ బొమ్మ వచ్చేలా భలే డిజైన్ చేసాడు. కుర్ కురే లాంటి ప్యాకెట్స్ ఖాళీ కవర్లని కట్ చేస్తూ, వాటిని అతికిస్తూ ఓ బొమ్మలాగా తయారుచేసి దాని మధ్యలో లైట్ పెట్టి ఆ షాడో ప్రభాస్ ఫేస్ వచ్చేలా చేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతూ అతన్ని అభినందిస్తున్నారు. వేస్ట్ కవర్లతో కూడా ఇంత అద్భుతం సృష్టించొచ్చా అని షాక్ అవుతున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి..