Prevention Of Pests : మినుము తోటలకు ఆశించిన చీడపీడల నివారణ

Prevention Of Pests : గతకొంత కాలంగా ఆకర్షణీయంగా వున్న మార్కెట్ ధరలు... సంప్రదాయ పంటలకన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణలు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు.

Prevention Of Pests : మినుము తోటలకు ఆశించిన చీడపీడల నివారణ

Prevention Of Pests

Prevention Of Pests : వరి తదితర ప్రధాన ఆహార పంటలతో పోల్చి చూస్తే.. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో, స్వల్పకాలంలో  చేతి కొచ్చే పంటలు అపరాలు. పల్లాకు వైరస్‌ తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని, సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఈ పంటలు ఎప్పుడూ లాభదాయకమే. అయితే పంట మొదటి దశనుండి పూత, కాత వరకు ఆశించే చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి.  ముఖ్యంగా రబీమాగాణుల్లో మినుము పంటకు ఆశించే చీడపీడలు.. వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. నందకిషోర్ ద్వారా తెలుసుకుందాం..

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వు సాగు యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

రాను రాను తెలుగురాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గతకొంత కాలంగా ఆకర్షణీయంగా వున్న మార్కెట్ ధరలు… సంప్రదాయ పంటలకన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణలు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమయింది. అన్ని పంటల సరళిలో ఒద్ధికగా ఒదిగిపోవటం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవటం, ఏక పంటగానే కాక పలు అంతర, మిశ్రమపంటల కలయికతో వీటిసాగు ఆశాజనకంగా వుంది.

20 నుండి 50 రోజుల దశలో మినుము పైర్లు :
తక్కువ వ్యవధిలోనే పంటచేతికొచ్చి, తర్వాత వేయబోయే పంటలకు అనువుగా వుండటంతో సాగు మరింత లాభదాయకంగా వుంది.  ప్రస్తుతం చాలామంది రబీమాగాణుల్లో రెండోపంటగా మినుమును విత్తారు. 20 రోజుల నుండి 50 రోజుల దశలో పంటలు ఉన్నాయి. అయితే తొలిదశనుండి పూత, పిందె వరకు అనేక చీడపీడలు ఆశించి తివ్రంగా నష్టం చేస్తుంటాయి. వీటిని ఎప్పటి కప్పుడు గుర్తిస్తూ.. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు కృష్ణా జిల్లా, ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. నందకిషోర్ .

ఈ పంటకు ఒక్కోసారి లద్దెపురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటుంది. ఆకు అడుగుబాగాన చేరి గుడ్లను పెడుతుంది. ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినటం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకుల, పువ్వులను, పిందెలను తింటాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తింటూ, పగల మొక్కల మొదళ్లోను భూమి నెర్రెలలోకి చేరుతాయి. వీటితో పాటు తెగుళ్లు ఆశించి తివ్రనష్టం చేస్తుంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.

Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం