Upasana : నేను, చరణ్.. ఇద్దరం ఇక్కడే పుట్టాం.. మా ఇద్దరికీ ఈ సిటీ అంటే చాలా ఇష్టం.. ఏ సిటీనో తెలుసా?

నిన్న అపోలో ఫౌండర్ డా. ప్రతాప్ చంద్ర రెడ్డి 91వ పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన ‘ది అపోలో స్టోరీ'(The Apollo Story) అనే పుస్తకాన్ని లాంచ్ చేసింది. పుస్తక లాంచింగ్ కార్యక్రమం అనంతరం ఉపాసన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి..

Upasana : నేను, చరణ్.. ఇద్దరం ఇక్కడే పుట్టాం.. మా ఇద్దరికీ ఈ సిటీ అంటే చాలా ఇష్టం.. ఏ సిటీనో తెలుసా?

Ram Charan Upasana Interesting fact about Their Favourite City

Upasana Ram Charan : నిన్న అపోలో(Apollo) ఫౌండర్ డా. ప్రతాప్ చంద్ర రెడ్డి 91వ పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన ‘ది అపోలో స్టోరీ'(The Apollo Story) అనే పుస్తకాన్ని లాంచ్ చేసింది. చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ఈ పుస్తక లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ పుస్తకంలో డా. ప్రతాప్ రెడ్డి గురించి, అపోలో హాస్పిటల్స్, సంస్థ ఎదిగిన విధానం, ఎదుర్కున్న సవాళ్లు.. ఇలా అనేక అంశాల గురించి ఉందని సమాచారం.

పుస్తక లాంచింగ్ కార్యక్రమం అనంతరం ఉపాసన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన తాతయ్య గురించి, అపోలో గురించి, తన తాతయ్య తన కూతుళ్లలో ఎలా స్ఫూర్తి నింపారు అని మాట్లాడింది. ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి చదవాలని, ఈ బుక్ చదివి ప్రతి మహిళ స్ఫూర్తి పొందాలని తెలిపింది.

Also Read : Venu : ‘బలగం’ వేణు అందులో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ అని తెలుసా? సినిమాల్లోకి రాకముందు..

అలాగే చెన్నై(Chennai) సిటీ గురించి మాట్లాడుతూ.. నేను ఇక్కడే పుట్టాను. చరణ్ కూడా ఇక్కడే పుట్టాడు. నాకు చెన్నై సిటీ అంటే ఇష్టం. చరణ్ కి కూడా చెన్నై మీద ప్రేమ. చెన్నై సిటీ మా ఇద్దరికీ చాలా స్పెషల్. అటు కామినేని, ఇటు కొణిదెల కుటుంబాలపై తెలుగు వాళ్ళే కాదు తమిళనాడు ప్రజలు కూడా అభిమానం చూపిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు అని తెలిపింది. దీంతో ఉపాసన, చరణ్ లకు చెన్నై సిటీ అంటే ఇష్టమని చెప్పిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.