Aiden Markram : ఈ క్యాచ్‌ను కావ్యా పాపా చూస్తే మాత్రం.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ స్ట‌న్నింగ్‌ క్యాచ్‌..

కెట్‌ మైదానంలో ఫీల్డ‌ర్లు చేసే విన్యాసాల‌కు కొద‌వే లేదు.

Aiden Markram : ఈ క్యాచ్‌ను కావ్యా పాపా చూస్తే మాత్రం.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ స్ట‌న్నింగ్‌ క్యాచ్‌..

Aiden Markram Takes Stunning One-Handed Catch During SA20 Game

Aiden Markram Take Stunning Catch : క్రికెట్‌ మైదానంలో ఫీల్డ‌ర్లు చేసే విన్యాసాల‌కు కొద‌వే లేదు. చిరుత‌ల్లా క‌దులుతూ బంతిని మెరుపు వేగంతో ఒడిసి ప‌ట్టుకుంటారు. కొన్ని సార్లు న‌మ్మ‌శ‌క్యం గానీ క్యాచ్‌ల‌ను అందుకుంటుంటారు. తాజాగా ద‌క్షిణాఫ్రికాలో జ‌రుగుతున్న టీ20 లీగ్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఈస్ట‌ర్న్ కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్‌ సైతం అలాంటి ఓ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మంగ‌ళ‌వారం న్యూలాండ్స్ వేదిక‌గా సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌, డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో డ‌ర్బ‌న్ ఇన్నింగ్స్‌లో ఈ అద్భుత క్యాచ్ న‌మోదైంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్‌ను ఒట్నీల్‌ బార్ట్‌మన్ వేశాడు. డ‌ర్బ‌న్ బ్యాట‌ర్ జేజే స్మట్స్ మిడాన్ దిశ‌గా ఫీల్డ‌ర్ పై నుంచి వెళ్లేలా షాట్ ఆడాడు. అయితే.. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న మార్‌క్ర‌మ్ స‌రైన టైమింగ్‌లో గాల్లోకి జంప్ చేశాడు. ఒంటిని విల్లులా వంచుతూ ఒంటి చేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు.

Rohit Sharma : స్టంప్ మైక్‌లో రోహిత్ మాట‌లు రికార్డు.. మైదానంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లను హిట్‌మ్యాన్‌ ఏమ‌న్నాడంటే ?

దీంతో నాలుగు బంతులు ఎదుర్కొన్న స్మ‌ట్స్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్యాచ్ టీమ్ ఓన‌ర్ కావ్యా మార‌న్ చూస్తే మాత్రం ఎగిరి గెంతులు వేస్తుంద‌ని అంటున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లో 8 వికెట్లు కోల్పోయి 157 ప‌రుగులు చేసింది. మలన్ (63; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. కెప్టెన్ మార్‌క్ర‌మ్ (30; 23 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్స్‌), జోర్డాన్ హెర్మాన్ (21)లు రాణించారు. డర్బన్ బౌలర్లలో మహరాజ్, జూనియ‌ర్ దలా చెరో రెండు వికెట్లు తీశారు. నవీన్-ఉల్-హక్, ప్రిటోరియస్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో డ‌ర్బ‌న్ 19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. దీంతో స‌న్‌రైజ‌ర్స్ 51 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరుకుంది.

Hanuma Vihari : రీ ఎంట్రీ పై తెలుగు కుర్రాడు హ‌నుమ విహారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఎవ‌రూ ట‌చ్‌లో లేరు