AUS vs WI : డేవిడ్ వార్న‌ర్ విధ్వంసం.. ర‌సెల్ ఊచ‌కోత‌.. మూడో టీ20లో విండీస్ గెలుపు

ఆస్ట్రేలియా టూర్‌ను వెస్టిండీస్ జ‌ట్టు విజ‌యంతో ముగించింది.

AUS vs WI : డేవిడ్ వార్న‌ర్ విధ్వంసం.. ర‌సెల్ ఊచ‌కోత‌.. మూడో టీ20లో విండీస్ గెలుపు

West Indies beat Australia by 37 runs in 3rd T20

ఆస్ట్రేలియా టూర్‌ను వెస్టిండీస్ జ‌ట్టు విజ‌యంతో ముగించింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో నామ‌మాత్ర‌పు మూడో టీ20 మ్యాచులో ఓదార్పు విజ‌యాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్‌ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన విండీస్ ఆట‌గాళ్లు 37 ప‌రుగుల తేడాతో గెలిచి క్లీన్‌స్వీప్ నుంచి త‌ప్పించుకున్నారు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో వెస్టిండీస్ రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడింది. ఇందులో గ‌బ్బా వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టుతో పాటు నేటి మ్యాచ్‌తో క‌లిపి రెండు మ్యాచుల్లోనే విండీస్ గెల‌వ‌డం గ‌మ‌నార్హం. మిగిలిన అన్ని మ్యాచుల్లో ఆస్ట్రేలియా జ‌ట్టు గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 220 ప‌రుగులు చేసింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో ఆండ్రీ ర‌సెల్ (71; 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), రూథ‌ర్‌పోర్డ్ (67నాటౌట్; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) దంచికొట్టారు.

BCCI : బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం! ఇషాన్‌ కిష‌న్‌తో పాటు మిగిలిన ఆట‌గాళ్లకు గ‌ట్టి షాక్‌!

వీరితో పాటు రోస్టన్‌ ఛేజ్‌ (37), రోవ్‌మన్‌ పావెల్‌ (21) లు రాణించ‌డంతో విండీస్ భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో జేవియర్ బార్ట్‌లెట్ రెండు వికెట్లు తీశాడు. బెహ్రెండోర్ఫ్, స్పెన్సర్ జాన్సన్, ఆరోన్ హార్డీ, ఆడ‌మ్ జంపాలు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టాడు.

వార్న‌ర్ అద‌ర‌గొట్టినా..

భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ (81; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) దంచికొట్టాడు. బౌండ‌రీల‌తో వెస్టిండీస్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఆఖ‌ర్లో టిమ్ డేవిడ్ (41 నాటౌట్; 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. మిచెల్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (1), గ్లెన్ మాక్స్‌వెల్ (12)లు విఫలం అయ్యారు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అఖిల్ హోసేన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Virat Kohli : కోహ్లీ భార్యకు ఏమైంది? అనుష్క‌శ‌ర్మ ప్రెగ్నెన్సీలో స‌మ‌స్య‌లు? ఏదీ నిజం?