Dhruv Jurel : నాకే బౌన్స‌ర్ వేస్తావా.. అరంగ్రేట ఆట‌గాడు ధ్రువ్ జురెల్ దెబ్బ‌కు బిత్త‌ర‌పోయిన ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు

రెండో రోజు ఆట‌లో అరంగ్రేట ఆట‌గాడు ధ్రువ్ జురెల్‌ను ఇంగ్లాండ్ స్టార్ పేస‌ర్ మార్క్‌వుడ్ బౌన్స‌ర్ల‌తో ఇబ్బంది పెట్టాల‌ని చూశాడు.

Dhruv Jurel : నాకే బౌన్స‌ర్ వేస్తావా.. అరంగ్రేట ఆట‌గాడు ధ్రువ్ జురెల్ దెబ్బ‌కు బిత్త‌ర‌పోయిన ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు

Dhruv Jurel ramps Mark Wood bouncer for six for first Test boundary

Dhruv Jurel Upper Cut Six : రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్ జ‌ట్టుతో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తోంది. రెండో రోజు ఆట‌లో అరంగ్రేట ఆట‌గాడు ధ్రువ్ జురెల్‌ను ఇంగ్లాండ్ స్టార్ పేస‌ర్ మార్క్‌వుడ్ బౌన్స‌ర్ల‌తో ఇబ్బంది పెట్టాల‌ని చూశాడు. 146 కి.మీ వేగంతో ఓ బౌన్స‌ర్‌ను సంధించ‌గా.. ధ్రువ్ జురెల్ ఎంతో స‌మ‌య‌స్పూర్తితో స్లిప్స్ మీదుగా అప్ప‌ర్ క‌ట్ షాట్ ఆడి సిక్స‌ర్‌గా మ‌లిచాడు. అరంగ్రేట ఆట‌గాడు ఇలాంటి షాట్ ఆడ‌తాడ‌ని ఊహించ‌ని ఇంగ్లాండ్ పేస‌ర్ వుడ్ బిత్త‌ర‌పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

కాగా.. ఓవ‌ర్ నైట్ స్కోరు 326/5 రెండో రోజు ఆట‌ను ఆరంభించిన టీమ్ఇండియా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింంది. నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాద‌వ్ (4)ను జేమ్స్ అండ‌ర్స‌న్‌, సెంచ‌రీ హీరో ర‌వీంద్ర జ‌డేజాను జో రూట్ ఔట్ చేశాడు. ఈ ద‌శ‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ధ్రువ్‌జురెల్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌తో జ‌త‌క‌లిశాడు. వీరిద్ద‌రూ స‌మ‌యోచితంగా బ్యాటింగ్ చేస్తున్నారు.

Anil Kumble : నా దురదృష్టం సర్ఫరాజ్ ఖాన్‌కు అంటుకున్న‌ట్లుంది.. అనిల్ కుంబ్లే వ్యాఖ్య‌లు వైర‌ల్‌

ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. మ‌రో వికెట్ ప‌డ‌కుండా తొలి సెష‌న్‌ను ముగించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీరు ఎనిమిదో వికెట్‌కు 57 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. లంచ్ విరామానికి భార‌త స్కోరు 388/7. ధ్రువ్ జురెల్ (31), ర‌విచంద్ర‌న్ అశ్విన్ (25) లు క్రీజులో ఉన్నారు.