Jonny Bairstow : ఏంట‌య్యా ఇదీ.. భార‌త్ అంటే అంత భ‌య‌ప‌డిపోతున్నావ్‌ ఎందుకు? ఇలా అయితే కెరీర్ ఖ‌తం

ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగిస్తోంది.

Jonny Bairstow : ఏంట‌య్యా ఇదీ.. భార‌త్ అంటే అంత భ‌య‌ప‌డిపోతున్నావ్‌ ఎందుకు? ఇలా అయితే కెరీర్ ఖ‌తం

Jonny Bairstow unwanted record

Jonny Bairstow unwanted record : ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 445 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా ఇంగ్లాండ్‌ను మొద‌టి ఇన్నింగ్స్‌లో 319 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. దీంతో భార‌త్ కు కీల‌కమైన 126 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

ఓవ‌ర్ నైట్ స్కోరు 207/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ఆట‌ను కొన‌సాగించిన ఇంగ్లాండ్‌కు బుమ్రా షాకిచ్చాడు. 224 ప‌రుగుల వ‌ద్ద స్టార్ ఆటగాడు జోరూట్ ను ఔట్ చేశాడు. రివ‌ర్స్ స్వీప్ కు య‌త్నించిన రూట్ స్లిప్‌లో య‌శ‌స్వి జైస్వాల్ చేతికి చిక్కాడు. రూట్ అనంత‌రం బ‌రిలోకి దిగిన బెయిర్ స్టోకు కుల్దీప్ యాద‌వ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. నాలుగు బంతులే ఎదుర్కొన్న బెయిర్ స్టో ఎల్బీగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. క‌నీసం ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేదు. ఈ క్ర‌మంలో బెయిర్ స్టో ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Dhruv Jurel : వికెట్ కీపింగ్ అంటే అంత ఈజీ కాదు జురెల్‌..! ఇప్పుడు చూడు.. ఇంగ్లాండ్‌కు అప్ప‌నంగా నాలుగు ప‌రుగులు

టెస్టుల్లో భార‌త జ‌ట్టు పై అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. 37 ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిది సార్లు డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఆ త‌రువాతి స్థానాల్లో పాకిస్తాన్ ఆట‌గాడు క‌నేరియా 15 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్న‌ర్ నాథ‌న్ లియోన్ 40 ఇన్నింగ్స్‌ల్లో ఏడు సార్లు, ఇంగ్లాండ్ వెట‌ర‌న్ ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్ 52 ఇన్నింగ్స్‌ల్లో 6 సార్లు డ‌కౌట్ అయ్యారు.

టెస్టుల్లో టీమ్ఇండియాపై అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాళ్లు వీరే..

జానీ బెయిర్ స్టో (ఇంగ్లాండ్‌) – 37 ఇన్నింగ్స్‌ల్లో – 8 సార్లు డ‌కౌట్‌
డానిష్ క‌నేరియా (పాకిస్తాన్‌) – 15 ఇన్నింగ్స్‌ల్లో – 7 సార్లు
నాథ‌న్ లియోన్ (ఆస్ట్రేలియా) – 40 ఇన్నింగ్స్‌ల్లో – 7 సార్లు
జేమ్స్ అండ‌ర్స‌న్ (ఇంగ్లాండ్‌) – 52 ఇన్నింగ్స్‌ల్లో – 6 సార్లు
మెర్విన్ డిల్లాన్ (వెస్టిండీస్‌) – 15 ఇన్నింగ్స్‌ల్లో – 6 సార్లు
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 22 ఇన్నింగ్స్‌ల్లో – 6 సార్లు

ప్ర‌స్తుతం క్రికెట్ ఆడే వారిలో అత్యుత్త‌మ క్రికెట‌ర్లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న బెయిర్ స్టో భార‌త్ పై మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాడు. ఈ సిరీస్‌లో చెత్త ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 98 ప‌రుగులే చేశాడు. ఒక్క‌సారి కూడా అర్ధ‌శ‌త‌కాన్ని కూడా అందుకోలేదు.

IND vs ENG : టెస్టు మ్యాచ్ మ‌ధ్య‌లో వెళ్లిపోయిన అశ్విన్‌.. అత‌డి స్థానంలో అక్ష‌ర్ ఆడొచ్చా? నిబంధ‌న‌లు ఏమి చెబుతున్నాయంటే?

జానీ బెయిర్‌స్టో తన కెరీర్‌లో 98 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 36.66 సగటుతో 5902 పరుగులు చేశాడు. ఇందులో 26 అర్ధ సెంచరీలు, 12 సెంచరీలు ఉన్నాయి. అయినప్పటికీ అతను తన టెస్ట్ కెరీర్‌లో 17 సార్లు డ‌కౌట్ కావ‌డం గ‌మ‌నార్హం. వీటిలో ఎనిమిది భార‌త్ పైనే ఉండ‌డం విశేషం.