IND vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్‌..!

ఇంగ్లాండ్‌తో మొద‌టి టెస్టులో ఓడిపోయిన‌ప్ప‌టికీ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా బ‌లంగా పుంజుకుంది.

IND vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్‌..!

Jasprit Bumrah likely to be rested for Ranchi Test reports

IND vs ENG – Jasprit Bumrah : ఇంగ్లాండ్‌తో మొద‌టి టెస్టులో ఓడిపోయిన‌ప్ప‌టికీ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా బ‌లంగా పుంజుకుంది. వ‌రుస‌గా రెండు టెస్టుల్లోనూ విజ‌యం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌లు ముగిసే నాటికి 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి 23 నుంచి రాంచీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లోనూ అద‌ర‌గొట్టేందుకు భార‌త్ సిద్ధ‌మ‌వుతోంది. అయితే.. టీమ్ఇండియా విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆడ‌డం లేదు.

అత‌డి పై ఒత్త‌డి త‌గ్గించాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంద‌ని, ఈ క్ర‌మంలో అత‌డికి నాలుగో టెస్టు మ్యాచ్‌కు విశ్రాంతి నిచ్చిన‌ట్లు క్రిక్‌బ‌జ్ తెలిపింది. మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన వెంట‌నే బుమ్రా రాజ్‌కోట్ నుంచి అహ్మ‌దాబాద్‌కు బ‌య‌లుదేరి వెళ్లాడు. మిగిలిన జ‌ట్టు స‌భ్యులు మంగ‌ళ‌వారం రాంచీ వెళ్ల‌నున్నారు. అత‌డి స్థానంలో ఎవ‌రిని తీసుకుంటారు అనే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం లేదంది. కాగా.. బుమ్రా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచుల్లో 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Ravindra Jadeja : రాజ్‌కోట్‌లో చిరు ఇంద్ర సినిమా సీన్‌.. జ‌డేజా యాక్ష‌న్ వేరేలెవ‌ల్!

సాధార‌ణంగా రాంచీ మైదానం స్పిన్న‌ర్ల‌కు అనుకూలం అన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఫ‌లితాన్ని బ‌ట్టి ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌లో బుమ్రా ఆడాలా వ‌ద్దా అనే దానిపై జ‌ట్టు మేనేజ్‌మెంట్ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

అందుబాటులోకి రాహుల్ ?
హైద‌రాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తొడ‌కండ‌రాల గాయం బారిన ప‌డ్డాడు. దీంతో అత‌డు విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు, రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్ బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో ప్ర‌స్తుతం ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు. రాంచీ టెస్టు మ్యాచ్‌కు అత‌డు అందుబాటులో ఉంటాడా? ఉండ‌డా? అన్న విష‌యం ఇంకా తెలియ‌రాలేదు. మ్యాచ్‌కు ముందు మాత్ర‌మే దీనిపై స‌మాచారం తెలిసే అవ‌కాశం ఉంది.

రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 319 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (214 నాటౌట్‌) విధ్వంస‌క‌ర డ‌బుల్ సెంచ‌రీ బాద‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ 430/4 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 557 ప‌రుగుల ల‌క్ష్యం నిలవ‌గా 122 ప‌రుగుల‌కే ఇంగ్లాండ్ కుప్ప‌కూలింది. భార‌త్ 434 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.

Also Read : చెప్పేది నీకే.. ముందు నువ్వెళ్లు.. ఆ త‌రువాత నేనొస్తా.. జైస్వాల్‌తో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ! ఏంట‌న్నా ఇదీ!