Jagga Reddy: అందుకే కల్వకుంట్ల కవితకు సంబంధించి కొత్త సీరియల్ స్టార్ట్ అయింది: జగ్గారెడ్డి

ఇప్పుడు కవితకి ఇచ్చే నోటీసుల గురించి కిషన్ రెడ్డికి ఏమీ తెలిసి ఉండదని జగ్గారెడ్డి అన్నారు. మళ్లీ ఢిల్లీ..

Jagga Reddy: అందుకే కల్వకుంట్ల కవితకు సంబంధించి కొత్త సీరియల్ స్టార్ట్ అయింది: జగ్గారెడ్డి

Jagga Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చోటుచేసుకున్న పరిణామాలు, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చిన విషయం తెలిసిందే. గతంలోనూ కవితను ఈడీ, సీబీఐ విచారించింది.

దీనిపై ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల కంటే ముందుగానే కవితని ఈడీ అరెస్ట్ చేస్తుందని అప్పట్లో బండి సంజయ్ అన్నారని చెప్పారు. ఈడీకి విలువ లేకుండా చేశారని అన్నారు. ఒకవేళ కవితని అరెస్ట్ చేయకపోతే బండి సంజయ్ సమాధానం చెప్పలేరు కాబట్టి అయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసి పక్కన పెట్టారని ఆరోపించారు.

ఇప్పుడు కవితకి ఇచ్చే నోటీసుల గురించి కిషన్ రెడ్డికి ఏమీ తెలిసి ఉండదని జగ్గారెడ్డి అన్నారు. మళ్లీ ఢిల్లీ నుంచి గేమ్ మొదలు పెడతారని చెప్పారు. లోకసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కవిత కొత్త సీరియల్ స్టార్ట్ అయిందని తెలిపారు. కాంగ్రెస్‌కి వచ్చే 14 సీట్లకు గండి కొట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పారు.

కిషన్ రెడ్డి సమ్మక్క సారక్క లనే మోసం చేశారని, తెలంగాణ ప్రజల్ని మోసం చేయటం పెద్ద పనా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. గ్యాస్, ఉచిత విద్యుత్తుకు సంబంధించిన హామీలపై రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటన చేశారని తెలిపారు. మేడారం జాతరని జాతీయ పండుగగా ప్రకటిస్తామని అర్జున్ ముండా, కిషన్ రెడ్డి రెండేళ్ల క్రితం చెప్పారని అన్నారు.

నిన్న దీనిపై మీడియా అడిగిన ప్రశ్నపై కిషన్ రెడ్డి సానుకూల సమాధానం ఇవ్వలేదని చెప్పారు. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి మొక్కుతారు కాబట్టే మేడారం జాతరను జాతీయ పండగ చేయాలనే చర్చ వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రజలను పదేళ్లుగా బీజేపీ మోసం చేస్తూనే ఉందని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ 14 సీట్లు దకించుకోనే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కిషన్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, తెలంగాణలో ఒకలా మాట్లాడుతున్నారని అన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరల మీద కిషన్ రెడ్డి చర్చ తీసుకురారని తెలిపారు. తమ పార్టీని బద్నాం చేసే పనిలో ఉన్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని అన్నారు. బీజేపీ 3 సీట్లు కూడా దకించుకోలేకపోతే రాష్ట్రంలో ఉనికిని కోల్పోతారని కాంగ్రెస్ మీద బీజేపీ నేతలు బురద చల్లే ప్రయత్నం బీజేపీ చేస్తున్నారని తెలిపారు.

Read Also: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు, ప్రమాదానికి అసలు కారణం అదే