500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు 26న శంకుస్థాపన చేయనున్న మోదీ.. తెలంగాణలో ఎన్నంటే?

ఈనెల 26న దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, దాదాపు 1500 రైల్వే ప్లైఓవర్లు, అండర్ పాస్ లకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు.

500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు 26న శంకుస్థాపన చేయనున్న మోదీ.. తెలంగాణలో ఎన్నంటే?

PM Modi

PM Modi : ఈనెల 26న దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, దాదాపు 1500 రైల్వే ప్లైఓవర్లు, అండర్ పాస్ లకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. 2014 లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి రైల్వేశాఖకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇందులోభాగంగా కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలలో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది. అంతేకాకుండా, రైల్వేలలో 100శాతం విద్యుద్దీకరన సాధన లక్ష్యంగా పని చేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా చేపట్టిన పనులు పెద్దఎత్తున పురోగతి సాధించాయి.

వీటితోపాటుగా రైల్వే క్రాస్ ల వద్ద రద్దీని నివారించడానికి వీలుగా అవసరాన్ని బట్టి రైల్వే ఫ్లై ఓవర్లను, రైల్ అండర్ పాస్ లను నిర్మిస్తూ వస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కవచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ లలో అమలు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. రైళ్లు, రైల్వే లైన్ల విస్తరణ మీద మాత్రమే కాకుండా రైల్వేస్టేషన్లను ఆధునీకరించి, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా “అమృత్ భారత్ స్టేషన్ల” పేరిట నూతన పథకాన్ని ప్రారంభించిన భారతీయ రైల్వే.. దేశవ్యాప్తంగా ఉన్న అనేక రైల్వేస్టేషన్లను ఆధునీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుతోపాటు, దాదాపు 1500 రైల్వే ప్లై ఓవర్లు, అండర్ పాస్ లకు ప్రధాని మోదీ 26న భూమి పూజ చేయనున్నారు.

Also Read : TDP-Janasena First List : 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ.. కేవలం ఐదు స్థానాలకే అభ్యర్థుల ప్రకటన.. ఎందుకంటే?

తెలంగాణలో ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ భావించింది. ఇందుకోసం మొత్తం రూ. 2,245 కోట్ల నిధులను కేటాయించింది. 40 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లకుగాను, గత ఆగస్టు నెలలో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు.

  • అమృత్ భారత్ స్టేషన్లు ఇవే..
  • జడ్చర్ల – రూ. 10.94 కోట్లు
  • గద్వాల్ – రూ. 9.49కోట్లు
  • షాద్ నగర్ – రూ. 9.59 కోట్లు
  • మేడ్చల్ – రూ. 8.37 కోట్లు
  • మెదక్ – రూ. 15.31 కోట్లు
  • ఉందా నగర్ – రూ. 12.37 కోట్లు
  • బాసర – రూ. 11.33 కోట్లు
  • యాకుత్ పుర – రూ. 8.53 కోట్లు
  • మిర్యాలగూడ – రూ. 9.50 కోట్లు
  • నల్గొండ – రూ. 9.50 కోట్లు
  • వికారాబాద్ – రూ. 24.35 కోట్లు
  • పెద్దపల్లి – రూ. 26.49 కోట్లు
  • మంచిర్యాల – రూ. 26.49 కోట్లు
  • వరంగల్ – రూ. 25.41 కోట్లు
  • బేగంపేట – రూ. 22.57 కోట్లు

Also Read : టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన

  • రైల్వే అండర్ పాస్ లు ఇవే..
  • అమృత్ భారత్ స్టేషన్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో రూ. 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న ఒక రైల్వే ఫ్లై ఓవర్ కు, 16 రైల్వే అండర్ పాస్ లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
  •  హైదరాబాద్ డివిజన్ లోని బోధన్ వద్ద రైల్వే ఫ్లై ఓవర్, మేళ్ల చెరువు, కురుముర్తి వద్ద 2, చిలకమర్రి, గౌడవల్లి, కీసర, రామాంతపూర్, పాలాట, కూచవరం వద్ద 2 మదనపూర్, గద్వాల్ వద్ద రైల్వే అండర్ పాస్ లు.
  • సికింద్రాబాద్ డివిజన్ లోని కురచపల్లి, వెలమల, చాగల్ వద్ద రైల్వే అండర్ పాస్ లు.
  • గుంతకల్ డివిజన్ లోని నారాయణపేట వద్ద రైల్వే అండర్ పాస్ ల నిర్మాణం జరగనుంది. వీటితోపాటు ఆయా డివిజన్ లలో రూ. 221 కోట్లకుపైగా నిధులతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న మూడు రైల్వే ఫ్లై ఓవర్ లను, 29 రైల్వే అండర్ పాస్ లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు.
  • హైదరాబాద్ డివిజన్ లోని మహబూబ్ నగర్ రూరల్, పెద్దదిన్నె, తిప్పాపూర్, గద్వాల్, సిద్దరామేశ్వర్ నగర్, బైరవాపురం, తలమడ్ల, ఇతిక్యాల, అడ్లూర్, నవీపేట్, ఉండవల్లి వద్ద రైల్ అండర్ పాస్ లు.
  • సికింద్రాబాద్ డివిజన్ లోని ఎర్రగుంట, ఉంకిచర్ల / నిరుపమకొండ, చర్లపల్లి వద్ద రైల్వే ఫ్లై ఓవర్ లు, విలాసాగర్, బిస్ బాగ్, శివపురం, కాశీపేట్, మంచిర్యాల, బూడ, కాజీపేట్, గరిడపల్లి, మీనవోలు, బయ్యారం, దెందుకూరు, ముత్యాలగూడెం, రాజనెల్లి, ఉప్పరపల్లి వద్ద రైల్వే అండర్ పాస్ లు.
  • గుంటూర్ డివిజన్ లోని నర్కెట్ పల్లి, కీసరజూపల్లి, బుదారం వద్ద రైల్వే అండర్ పాస్ లు.
  • గుంతకల్ డివిజన్ లోని తంగడి వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

మోదీ, రైల్వే శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి ఇంత పెద్దఎత్తున సహకరిస్తుండటం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. 2014-15 లో రూ. 258 కోట్లుగా ఉన్న తెలంగాణ రైల్వే బడ్జెట్ కేటాయింపులను కేవలం 10 సంవత్సరాల కాలంలోనే దాదాపు 20 రెట్లు పెంచి 2024-25 నాటికి రూ. 5,071 కోట్లకు చేర్చడం తెలంగాణలో రైల్వేల అభివృద్ధి మీద మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.