10మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ? ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

ఇంతకీ తొలి జాబితాలో ఎవరెవరు ఉంటారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

10మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ? ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

Telangana BJP First List

Telangana BJP MP Candidates : తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేసింది. 10మంది అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నెలాఖరులోపు బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రానుంది. ఇంతకీ తొలి జాబితాలో ఎవరెవరు ఉంటారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ సర్కార్ ఖాయమని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. ఇందుకోసం ఈసారి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున లోక్ సభ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో కమలదళం కసరత్తు చేస్తోంది. 2014లో అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కేవలం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మాత్రమే బీజేపీ గెలుచుకోగా.. ఆ తర్వాత 2019 నాటికి ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. 21 శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది.

4 లోక్ సభ స్థానాలు (కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్) దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా 10 ఎంపీ సీట్లు గెలుస్తామనే ధీమాలో బీజేపీ నాయకులు ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ఖరారు చేసుకుని రంగంలోకి దిగేందుకు కూడా రెడీ అవుతున్నారు. దాదాపు 10 స్థానాల్లో అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం.

బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?
1. సికింద్రాబాద్‌ – జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
2. కరీంనగర్‌ – బండి సంజయ్‌, ఎంపీ
3. నిజామాబాద్‌ – ధర్మపురి అర్వింద్‌, ఎంపీ
4. ఆదిలాబాద్‌ – సోయం బాపూరావు, ఎంపీ
5. చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ
6. భువనగిరి – బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎంపీ
7. వరంగల్‌ – కృష్ణప్రసాద్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌
8. మెదక్‌ – ఎం.రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే
9. హైదరాబాద్‌ – రాజాసింగ్‌, గోశామహల్ ఎమ్మెల్యే (ఎలాగైనా ఎంఐఎంను ఓడించాలని బీజేపీ పట్టుదల)
10. పెద్దపల్లి – మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు
11. మహబూబ్‌నగర్‌ – డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు


మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే రేసులో ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్నారు. వారిలో ఎవరికి టికెట్ వస్తుంది? రెండో జాబితాలో ఎవరి పేర్లు ఖరారు అవుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.


మిగిలిన నియోజకవర్గాల్లో రేసులో ఇద్దరు అభ్యర్థులు..

1. నాగర్‌కర్నూల్‌
బంగారు శృతి, బీజేపీ అధికార ప్రతినిధి
రాములు, ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యులు

2. జహీరాబాద్‌
ఆలె భాస్కర్‌, బీజేపీ నేత
దిల్‌ రాజు, సినీ నిర్మాత

3. ఖమ్మం
ఈవీ రమేశ్‌, బీజేపీ నేత
వాసుదేవరావు, బీజేపీ నేత

4. నల్లగొండ
జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ
మనోహర్‌రెడ్డి, బీజేపీ నేత

5. మహబూబాబాద్‌
టీ.రామచంద్రునాయక్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌
సోలంకి శ్రీనివాస్‌, బీజేపీ అధికార ప్రతినిధి


అన్నింటికంటే బీజేపీలో కీలకమైన నియోజకవర్గం మల్కాజ్ గిరి.. టికెట్ రేసులో కీలక నేతలు.. బీజేపీ స్థాయి నేతల ఫోకస్ కూడా మల్కాజ్ గిరి పైనే..

మల్కాజిగిరి
పి.మురళీధర్‌రావు.. జాతీయ నేత, మధ్యప్రదేశ్‌ బీజేపీ ఇన్‌చార్జి (ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు అత్యంత సన్నిహితుడు.. 40ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితం, ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు..)
ఈటల రాజేందర్, మాజీ మంత్రి (ఈసారి ఎలాగైనా ఎంపీగా పోటీ చేసి గెలిచి కేంద్రమంత్రి అవ్వాలని టార్గెట్) (మల్కాజ్ గిరి కాకపోతే కరీంనగర్, జహీరాబాద్, మెదక్ సీటు ఇవ్వాలని డిమాండ్)
మల్క కొమురయ్య, డీపీఎస్‌ అధినేత (ఆర్ఎస్ఎస్ లో మొదటి నుంచి పని చేశారు)

Also Read : సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

పూర్తి వివరాలు..