Kavitha: ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు.. బీఆర్ఎస్ స్పందన

కవితకు సంబంధించి పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఈడీ, ఐటీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Kavitha: ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు.. బీఆర్ఎస్ స్పందన

Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నివాసంలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కవిత సంబంధించి పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఈడీ, ఐటీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర బలగాల అధీనంలో కవిత నివాసం ఉంది. కవిత ఇంటికి బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం చేరుకుంది.

కవిత నివాసంలో సోదాలపై బీఆర్ఎస్ స్పందించింది. ఎన్నికల కోడ్ మరో 24 గంటల్లో వస్తుందనగా ఈ దాడులు ఏంటని బీఆర్ఎస్ నేత క్రిశాంత్ ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ ను శనివారం ప్రకటిస్తామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ పై విచారణ ఇవాళ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 19న విచారణ జరపనున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత తరఫు న్యాయవాది హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే పలుసార్లు కవితను ఈడీ విచారించింది.

కాంగ్రెస్ 100 రోజులు నేటితో పూర్తి.. ఖమ్మంలో 3 రోజులకు ఒకసారి నీళ్లు ఎందుకు వస్తున్నాయి?: హరీశ్ రావు