Rohit Sharma : మెగావేలంలోకి రానున్న రోహిత్ శ‌ర్మ‌? ముంబైని వీడ‌నున్నాడా?

ఈ క‌థ‌నం ప్ర‌కారం హార్దిక్ కెప్టెన్సీపై రోహిత్ శ‌ర్మ అసంతృప్తిగా ఉన్నాడ‌ట‌.

Rohit Sharma : మెగావేలంలోకి రానున్న రోహిత్ శ‌ర్మ‌?  ముంబైని వీడ‌నున్నాడా?

Photo Credit : @ MI Twitter

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో దారుణంగా విఫ‌లం అవుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓట‌మిపాలైంది. ఈ సీజన్‌కు ముందు రోహిత్ శ‌ర్మ స్థానంలో హార్దిక్ పాండ్య‌ను కెప్టెన్‌గా నియ‌మించారు. దీంతో ముంబై అభిమానుల్లో ఓ ర‌క‌మైన అసంతృప్తి నెల‌కొని ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనికి తోడు మూడు మ్యాచుల్లో ఓడిపోవ‌డంతో ఫ్యాన్స్‌లో ఆక్రోశాన్ని మ‌రింత పెంచింది.

ముంబై టీమ్‌లో రెండు గ్రూపులు ఉన్నాయ‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. సీనియ‌ర్లు రోహిత్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌ని, కొంద‌రు హార్దిక్‌కు మద్ద‌తు ప‌లుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో న్యూస్‌-24 ఓ సంచ‌ల‌నాత్మ‌క క‌థ‌నం ప్ర‌చురించింది. ఈ క‌థ‌నం ప్ర‌కారం హార్దిక్ కెప్టెన్సీపై రోహిత్ శ‌ర్మ అసంతృప్తిగా ఉన్నాడ‌ట‌. ముంబై ప్రాంచైజీ పై సైతం అత‌డు గుర్రుగా ఉన్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ 17వ సీజ‌న్ ముగిసిన వెంట‌నే అత‌డు ముంబై ప్రాంఛైజీని వీడ‌నున్న‌ట్లు స‌ద‌రు వార్త సారాంశం.

అత‌డితో పాటు కీల‌క ఆట‌గాళ్లు సూర్య‌కుమార్ యాద‌వ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా లు సైతం ముంబై వీడే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిపింది. వీరంతా 2025 ఐపీఎల్‌కు ముందు నిర్వ‌హించే మెగావేలంలోకి రానున్నార‌ని పేర్కొంది.

IPL 2024 : బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..! ధోని క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు?

ఇదిలా ఉంటే.. ద‌శాబ్దకాలం పాటు రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్‌కు నాయ‌క‌త్వం వ‌హించాడు. అత‌డి సార‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ ఐదు సార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. గ‌త రెండు సీజ‌న్లుగా ఆ జ‌ట్టు ఆశించిన రీతిలో రాణించ‌లేదు. ఈ క్ర‌మంలో భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని హార్దిక్ కు ప‌గ్గాలు అప్ప‌గించిన‌ట్లు రోహిత్ శ‌ర్మ‌ను నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి తొల‌గించిన స‌మ‌యంలో ఆ జ‌ట్టు హెడ్ కోచ్ చెప్పారు.

ముంబై ఇండియన్స్ జట్టు:
హార్దిక్ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్, విష్ణు వినోద్, నెహాల్ వధేరా, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, పీయూష్ చావ్లా, శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, తిలాకియో షెపర్డ్, వర్మ, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, ల్యూక్ వుడ్, క్వేనా మఫాకా

Ishan Kishan : సూప‌ర్‌మ్యాన్ గెట‌ప్‌లో ఇషాన్ కిష‌న్‌.. భ‌లే శిక్ష వేశారు బాసూ!