Virat Kohli : కారు డోరు తెరిచేందుకు తంటాలు పడ్డ కోహ్లి! వీడియో వైరల్..
ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు
![Virat Kohli : కారు డోరు తెరిచేందుకు తంటాలు పడ్డ కోహ్లి! వీడియో వైరల్.. Virat Kohli : కారు డోరు తెరిచేందుకు తంటాలు పడ్డ కోహ్లి! వీడియో వైరల్..](https://10tv.in/wp-content/uploads/2024/04/Virat-Kohli-tried-to-open-the-car-door-which-got-stuck-Mumbai-Airport.jpg)
Virat Kohli tried to open the car door which got stuck Mumbai Airport
Kohli : ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ఐదు మ్యాచుల్లో 316 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. కోహ్లి చాలా బాగా ఆడుతున్నప్పటికీ అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాలను అందుకోలేకపోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ 5 మ్యాచులు ఆడగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలుపొందింది. రెండు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి శతకంతో చెలరేగాడు. ఐపీఎల్లో కోహ్లికి ఇది 8 సెంచరీ. విరాట్ మినహా మిగిలిన బ్యాటర్లు, బౌలర్లు విఫలం కావడంతో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి ముంబైకి పయనం అయ్యాడు.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక్క భారతీయుడు.. ఆ వెనకే విరాట్ కోహ్లి
ఏప్రిల్ 11 గురువారం ముంబైలోని వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కాకుండా విరాట్ ఒంటరిగా ముంబైకి వెళ్లాడు. ముంబై ఎయిర్ పోర్ట్‌లో కోహ్లి ఉండగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అతడు కారు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కారు మధ్య డోరును తెరిచేందుకు ప్రయత్నించగా అది తెరచుకోలేదు.
రెండు మూడు సార్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. డ్రైవర్‌తో మాట్లాడినా ఉపయోగం లేకపోయింది. చివరకు చేసేది ఏమీ లేక ఫ్రంట్ డోరు ఓపెన్ చేసి డ్రైవర్ పక్క సీటులో కూర్చోన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వూమ్ప్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. పాపం కోహ్లి.. ఆర్సీబీ ఆటగాళ్లే కాదు కారు డోర్లు కూడా సహకరించడం లేదు. ఒక్కడే ఎంతకనీ భారాన్ని మోస్తాడు చెప్పండి అంటూ ఆర్సీబీ ఓటములను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram