IPL 2024 : ఎంఎస్ ధోని దెబ్బకు గ్రౌండ్‌లో చెవులు మూసుకున్న ఆండ్రీ రస్సెల్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

IPL 2024 : ఎంఎస్ ధోని దెబ్బకు గ్రౌండ్‌లో చెవులు మూసుకున్న ఆండ్రీ రస్సెల్.. వీడియో వైరల్

MS Dhoni

MS Dhoni : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఆల్ రౌండర్ జడేజా మాయాజాలంతో కోల్ కతా జట్టు ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 137 పరుగులకే పరిమితమైంది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 17.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లను జడేజా తన బౌలింగ్ మాయాజాలంతో దెబ్బతీశాడు. నాలుగు ఓవర్లు వేసిన జడేజా.. కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

Also Read : Csk Vs Kkr : రెచ్చిపోయిన రుతురాజ్.. కోల్‌కతాపై చెన్నై విజయం

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ సమయంలో 19 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఆ సమయంలో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ధోనీ మైదానంలో బ్యాట్ తో అడుగు పెట్టగానే స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో మారుమోగిపోయింది. ధోనీ.. ధోనీ.. అంటూ ప్రేక్షకులు పెద్దెత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శబ్దం స్థాయి 125 డెసిబుల్స్ కు చేరుకుంది. ధోనీ బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో కేకేఆర్ జట్టు ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ బౌండరీ లైన్ వద్ద ఉన్నాడు. ప్రేక్షకులు ధోనీధోనీ అంటూ పెద్దెత్తున నినాదాలతో స్టేడియంను హోరెత్తించారు. ఈ క్రమంలో ఆ శబ్దాన్ని తట్టుకోలేక ఆండ్రీ రస్సెల్ చెవులు మూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : Rohit Sharma : డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ స్పీచ్‌.. హార్దిక్‌కు కావాల్సింది అదే..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్ లో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడింది. మూడు మ్యాచ్ లలో విజయం సాధించగా.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. తొలుత ఆర్సీబీ. గుజరాత్ టైటాన్స్ జట్లపై సీఎస్కే విజయం సాధించింది. ఆ తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై ఓటమి పాలైంది. తాజాగా కేకేఆర్ జట్టుపై విజయం సాధించింది. వరుసగా రెండు ఓటముల తరువాత కేకేఆర్ జట్టుపై హోం గ్రౌండ్ లో సీఎస్కే జట్టు విజయం సాధించింది. దీంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉంది.