IPL 2024 : చెన్నై స్టేడియంలో ప్రేక్షకులను ఆటపట్టించిన రవీంద్ర జడేజా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!

సీఎస్కే జట్టు మరో మూడు పరుగులుచేస్తే విజయం సాధిస్తుంది. ఈ సమయంలో శివమ్ దూబే అవుట్ అయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్ కు ..

IPL 2024 : చెన్నై స్టేడియంలో ప్రేక్షకులను ఆటపట్టించిన రవీంద్ర జడేజా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!

Ravindra Jadeja

CSK Vs KKR IPL 2024 : మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచంలోనే అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన క్రికెటర్. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతనికి క్రీడాభిమానుల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 42ఏళ్ల వయస్సులోకూడా ధోనీ ఐపీఎల్ టోర్నీలో సీఎస్కే జట్టు విజయంలో కీలక భూమిక పోషిస్తున్నారు. వికెట్ల వెనుకాల కీపింగ్ లో అదరగొడుతూనే.. ఫీల్డింగ్ సెట్టింగ్ విషయంలోనూ జట్టు నూతన కెప్టెన్ రుతురాజ్ కు సహకారం అందిస్తున్నాడు. ఇక ధోనీ మైదానంలో కనిపించాడంటే చాలు ప్రేక్షకులు ధోనీ నామస్మరణతో స్టేడియంను హోరెత్తిస్తుంటారు. తాజాగా సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన సీఎస్కే వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

Also Read : IPL 2024 : ఎంఎస్ ధోని దెబ్బకు గ్రౌండ్‌లో చెవులు మూసుకున్న ఆండ్రీ రస్సెల్.. వీడియో వైరల్

సీఎస్కే జట్టు మరో మూడు పరుగులుచేస్తే విజయం సాధిస్తుంది. ఈ సమయంలో శివమ్ దూబే అవుట్ అయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్ కు ఎంఎస్ ధోనీ వస్తాడని భావించిన ప్రేక్షకులు ధోనీ.. ధోనీ అంటూ నామస్మరణ చేయడం ప్రారంభించారు. అయితే, రవీంద్ర జడేజా డ్రెస్సింగ్ రూం నుంచి బయటకు వచ్చి స్టేడియం వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మళ్లీ వెంటనే వెనక్కు వెళ్లడంతో.. బ్యాటింగ్ కు వచ్చేది ధోనీనే అని ప్రేక్షకులు అర్థమైంది.. ధోనీ మైదానం వైపు నడక ప్రారంభించడం మొదలు.. బ్యాటింగ్ పూర్తయ్యి స్టేడియం బయటకు వచ్చే వరకు కొద్ది నిమిషాల పాటు ధోనీ నామస్మరణతో చిదంబరం స్టేడియం దద్దరిల్లి పోయింది. జడేజా ప్రేక్షకులను ఆటపట్టించేందుకు చేసిన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోనీ, జడేజా మధ్య బంధాన్ని గొప్పగా వర్ణిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : Csk Vs Kkr : రెచ్చిపోయిన రుతురాజ్.. కోల్‌కతాపై చెన్నై విజయం

ఇదిలాఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 137 పరుగులకే పరిమితమైంది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 17.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు చేసి విజేతగా నిలిచింది.