IPL 2024 : ఇదేంట్రా బాబు..! పాట్ క‌మ్మిన్స్‌కు హారతి ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్

పంజాబ్ జట్టుతో ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఓ అభిమానికి పాట్ కమ్మిన్స్ కు హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

IPL 2024 : ఇదేంట్రా బాబు..! పాట్ క‌మ్మిన్స్‌కు హారతి ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్

Pat Cummins

IPL 2024 Pat Cummins : ఐపీఎల్ 17వ సీజన్ లో జరుగుతున్న మ్యాచ్ లు అభిమానులకు కిక్‌ను ఇస్తున్నాయి. చివరి బాల్ వరకు నువ్వానేనా అన్నట్లుగా ప్లేయర్లు తలపడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. అంతేకాదు.. కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. కమ్మిన్స్ నాయకత్వంలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన హైదరాబాద్ జట్టు.. మూడు మ్యాచ్ లలో విజయం సాధించి.. రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైంది.

Also Read : IPL 2024 : గిల్‌కు కోప‌మొస్తే ఎట్లుంట‌దో చూశారా..! అంపైర్‌పై సీరియస్.. వీడియో వైరల్

పాట్ కమ్మిన్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన నాటి నుంచి ఆ జట్టు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఐపీఎల్ ట్రోపీ హైదరాబాద్ జట్టుకే వస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. గతేడాది జరిగిన ప్రపంచ వరల్డ్ కప్ లో కమ్మిన్స్ ఆధ్వర్యంలోనే ఆస్ట్రేలియా జట్టు కప్ గెలుచుకుంది. అదికూడా భారత్ జట్టుపైనే. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టును ఓడిస్తామని చెప్పిమరీ కమ్మిన్స్ ఓడించారు.. దీంతో కమ్మిన్స్ నాయకత్వంపై హైదరాబాద్ జట్టు అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

Also Read : IPL 2024 : విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్.. రెండో ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు

పంజాబ్ జట్టుతో ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఓ అభిమాని పాట్ కమ్మిన్స్ కు హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పంజాబ్ జట్టుపై టాస్ సమయంలో కమ్మిన్స్ మాట్లాడుతున్నాడు.. ఆ సమయంలో టీవీ తెరపై కనిపిస్తున్న కమ్మిన్స్ కు అభిమాని హారతి ఇచ్చాడు. ఆ వీడియోను ఎక్స్ (ట్విటర్) లో పోస్టు చేసి.. బాహుబలి సినిమాలోని దండాలయ్యా.. దండాలయ్యా తెలుగు వర్షన్ పాటను ప్లే చేశాడు. అంతేకాదు.. ‘ కెప్టెన్ సర్.. మేము నిన్ను ప్రేమిస్తున్నాము అన్నా’.. అని పోస్టులో అభిమాని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఇదేంట్రా బాబూ.. అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.