Vishwak Sen : ఫస్ట్ టైం అంత చలిలో ప్రెస్ మీట్ పెట్టిన ‘గామి’ టీం.. నాకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు అంటున్న విశ్వక్..

హైదరాబాద్ లో ఓ మంచు ప్రదేశాన్ని ప్రత్యేకంగా తయారుచేసిన స్నో కింగ్‌డమ్‌లో గామి సినిమా ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

Vishwak Sen : ఫస్ట్ టైం అంత చలిలో ప్రెస్ మీట్ పెట్టిన ‘గామి’ టీం.. నాకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు అంటున్న విశ్వక్..

Vishwak Sen Gaami Movie OTT Pressmeet Conducting in Snow Place

Vishwak Sen : విశ్వక్ సేన్, చాందినీ చౌదని, అభినయ.. పలువురు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘గామి'(Gaami). విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తిక్ శబరీష్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 8న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఒక కొత్త కాన్సెప్ట్ తో సరికొత్త స్క్రీన్ ప్లేతో, హిమాలయాల్లో షూటింగ్ చేసి, అఘోరా పాత్రలో విశ్వక్ నటించి ప్రేక్షకులని మెప్పించారు. సినిమా మేకింగ్, టేకింగ్ కి కూడా ఎన్నో ప్రశంసలు వచ్చాయి.

థియేటర్స్ లో సక్సెస్ అయిన గామి సినిమా నిన్న ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో జీ5 టీం తరపున ఓ ప్రెస్ మెట్ నిర్వహించారు. అయితే సాధారణంగా ప్రెస్ మీట్ అంటే ఏదో థియేటర్లో, హోటల్ లో, ఆఫీస్ లో పెడతారు కానీ జీ5 టీం గామి ప్రెస్ మీట్ ని ఫుల్ మంచులో, చలిలో పెట్టింది. హైదరాబాద్ లో ఓ మంచు ప్రదేశాన్ని ప్రత్యేకంగా తయారుచేసిన స్నో కింగ్‌డమ్‌లో గామి సినిమా ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

Also Read : Rajamouli : రాజమౌళి మొన్న డ్యాన్సులు, ఇవాళ యాడ్స్.. మా సంగతేంటి బాబు అంటున్న మహేష్ బాబు ఫ్యాన్స్..

ఈ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అసలు ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో, స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్ మీట్ పెట్టాలి అని ఐడియా అంతా కూడా జీ5 టీందే. ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనుకుంటున్నాను. ముందే నాకు ఈ ఐడియా వచ్చి ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఇలా చలిలోనే పెట్టేవాడిని. గామి లాంటి సినిమాలకు అవార్డులు, ప్రశంసలు వస్తాయి, కలెక్షన్లు రావని అంతా అంటారు. కానీ ఈ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది అంటూ మరోసారి సినిమా గురించి పడ్డ కష్టం తెలిపాడు.

Vishwak Sen Gaami Movie OTT Pressmeet Conducting in Snow Place

డైరెక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ.. థియేటర్లో మా సినిమా కొంత మందికి అర్థం కాలేదు అన్నారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అర్ధం కాని వాళ్ళు మూడు నాలుగు సార్లు మా సినిమా చూడండి. మా సినిమా కాన్సెప్ట్ అర్ధమవుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీ5 సౌత్, మార్కెటింగ్ వైస్ ప్రెసడెంట్ లాయిడ్ జేవియర్ పాల్గొని.. ఇలా వినూత్నంగా ఆలోచించి స్నో కింగ్డమ్ లో పెట్టాము అని తెలిపారు.