DC vs LSG : ఏమ‌య్యా గోయెంకా.. పంత్‌ను కౌగిలించుకున్నావ్ స‌రే.. రాహుల్‌తో మ‌ళ్లీ ఏందిది..

మ్యాచ్ అనంత‌రం లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా చేసిన ప‌ని మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

DC vs LSG : ఏమ‌య్యా గోయెంకా.. పంత్‌ను కౌగిలించుకున్నావ్ స‌రే.. రాహుల్‌తో మ‌ళ్లీ ఏందిది..

Sanjiv Goenka hug Rishabh Pant but chats again KL Rahul after DC beat LSG

Delhi Capitals vs Lucknow Super Giants : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా మంగ‌ళ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. దీంతో సాంకేతికంగా ఢిల్లీ జ‌ట్లు త‌న ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవంగా ఉంచుకుంది. ఈ ఓట‌మితో ల‌క్నో ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంత‌రం లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా చేసిన ప‌ని మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 208 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ పోర‌ల్ (33 బంతుల్లో 58), ట్రిస‌న్ స్ట‌బ్స్ (25 బంతుల్లో 57 నాటౌట్‌) అర్ధ‌శ‌త‌కాలు బాదారు. ల‌క్ష్య ఛేద‌న‌లో నికోల‌స్ పూర‌న్ (27 బంతుల్లో 61) పోరాడిన‌ప్ప‌టికీ ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి 189 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 18 ప‌రుగుల తేడాతో ఢిల్లీ విజ‌యం సాధించింది.

Babar Azam : ఐపీఎల్‌లో కోహ్లి బిజీ.. విరాట్ రికార్డుల ప‌ని ప‌డుతున్న బాబ‌ర్ ఆజాం

ల‌క్నో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆ జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గోయెంకా మైదానంలోకి వ‌చ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను కౌగించుకున్నాడు.

అనంత‌రం తన కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో సుదీర్ఘ సంభాషణ చేశాడు. అయితే.. గోయెంకా ముఖంలో ఈ సారి కోపం క‌నిపించ‌లేదు. చిరున‌వ్వు క‌నిపించ‌డం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Virat Kohli : నన్ను చూస్తే నీకు న‌వ్వొస్తుందా పంత్‌..! వెళ్లి కూర్చో.. లేదంటే బ్యాట్‌తో కొడ‌తా : విరాట్ కోహ్లి

హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో అలా..

కాగా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో జ‌ట్టు చిత్తుగా ఓడిపోవ‌డంతో ఆగ్ర‌హానికి లోనైన గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ తో చాలా సీరియ‌స్‌గా మాట్లాడాడు. రాహుల్ న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికి కూడా ఏ మాత్రం విన‌లేదు. ఓడిపోయినంత మాత్ర‌న జ‌ట్టు కెప్టెన్ అయిన రాహుల్‌తో మైదానంలో ప్ర‌వ‌ర్తించే తీరు ఇదేనా అంటూ స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో రాహుల్ జ‌ట్టును వీడ‌తాడంటూ వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వివాదాన్ని ముగించేందుకు సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌కు ముందు త‌న ఇంటిలో విందుకు ఆహ్వానించాడు. రాహుల్ వ‌చ్చిన స‌మ‌యంలో అత‌డిని కౌగించుకుని త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ఫోటో కూడా వైర‌ల్‌గా మారింది.

RCB : కోహ్లికి సాయం చేసిన పంత్‌.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ కు లైన్ క్లియ‌ర్‌..! ఇక మిగిలింది చెన్నై ఒక్క‌టే..