హైదరాబాద్‌లో వర్షాలు.. అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం

అల్ప పీడనం వాయుగుండం మారే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్పారు.

హైదరాబాద్‌లో వర్షాలు.. అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం

Rains: Representative Image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ వాన కురిసింది. పలు ప్రాంతాల్లో వాహనాలు నత్తనడకన ముందుకు సాగాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, 10 టీవీతో హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి మాట్లాడారు. ఈఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే కేరళను తాకబోతున్నాయని తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ వైపు నుంచి చురుకుగా కదులుతున్నాయని చెప్పారు.

ఈ నెల చివరి నాటికి కేరళను తాకనున్నాయని అన్నారు. జూన్ మొదటి వారంలో తెలంగాణకు రానున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఎల్ నీలో ప్రభావం అంతగా లేదని చెప్పారు. మంగళవారం అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.

అల్ప పీడనం వాయుగుండం మారే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్పారు. అల్ప పీడన ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని తెలిపారు. అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురుస్తాయని అన్నారు.

కవితకు మళ్లీ షాక్.. జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించిన కోర్టు