Rohit Sharma : రోహిత్ శ‌ర్మ కామెడీ.. ప‌డిప‌డి న‌వ్విన పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం.. మ్యాచ్ గోవిందా..?

ఈ మ్యాచ్‌కు ముందు టాస్ వేసే స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌న్నీ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ కామెడీ.. ప‌డిప‌డి న‌వ్విన పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం.. మ్యాచ్ గోవిందా..?

Rohit Sharma forgets he had coin in his pocket during toss in IND vs PAK clash

Rohit Sharma – Babar Azam : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ పై ఉన్న ఘ‌న‌మైన రికార్డును టీమ్ఇండియా కొన‌సాగించింది. 120 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకుంది. ఆదివారం నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో స్వ‌ల్ప స్కోర్లు న‌మోదైన మ్యాచ్‌లో భార‌త్ 6 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ పై విజ‌యం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టాస్ వేసే స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌న్నీ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో టాస్ ఆల‌స్యమైంది. వ‌రుణుడు క‌రుణించిన త‌రువాత టాస్ కోసం ఇరు జ‌ట్ల కెప్టెన్లు, మ్యాచ్ రిఫ‌రీ, వ్యాఖ్యాత ర‌విశాస్త్రి అంద‌రూ పిచ్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. వ్యాఖ్య‌త ర‌విశాస్త్రి మాట్లాడుతూ రోహిత్ శ‌ర్మ కాయిన్ ను గాల్లోకి వేస్తాడ‌ని చెప్పాడు. అయితే.. టాస్ కాయిన్‌ను జేబులోనే పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ ఆ విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్లుగా ఉన్నాడు. కాయిన్ ఎక్క‌డ ఉంది భాయ్‌..? అంటూ ప్ర‌శ్నించాడు.

IND vs PAK : సూప‌ర్ ఫ్యాన్.. టీమ్ఇండియా జెర్సీతో క‌నిపించిన మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌..

నీ ద‌గ్గ‌రే ఉంది అంటూ రిఫ‌రీ స‌మాధానం చెప్ప‌గా.. త‌న జేబులో చెక్ చేసుకోగా అందులోనే ఉంది. జేబులోంచి కాయిన్ తీసి గాల్లోకి ఎగుర‌వేశాడు. ఈ ఘ‌ట‌న‌తో రోహిత్ శ‌ర్మ‌, పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంతో పాటు అక్క‌డ ఉన్న‌వారంద‌రూ న‌వ్వేశారు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

కాగా.. టాస్‌ సమయాల్లో రోహిత్ మతిమరుపుతో ప్రవర్తించడం ఇదేం కొత్త కాదు. టాస్ గెలిచిన త‌రువాత తుది జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఆడుతున్నారో చెప్పే క్ర‌మంలో ప‌లు మార్లు రోహిత్ శ‌ర్మ మ‌రిచిపోయేవాడు. కొంత‌సేపు ఆలోచించి, గుర్తుకు తెచ్చుకునే వాడు.

ఓటమి అంచుల్లోకి భారత్.. బుమ్రా దెబ్బకు చేతులెత్తేసిన పాకిస్థాన్

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త జ‌ట్టు తొలుత‌ బ్యాటింగ్ చేసింది. 19 ఓవ‌ర్ల‌లో 119 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్ (42) టాప్ స్కోర‌ర్‌. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్ లు చెరో మూడు వికెట్లు, మహ్మద్‌ ఆమిర్ రెండు వికెట్లు తీశారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులే ప‌రిమిత‌మైంది. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (31) టాప్ స్కోర‌ర్‌. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో బుమ్రా మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)