Movie Shooting Updates : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? దేవర, విశ్వంభర, పుష్ప 2, గేమ్ ఛేంజర్ సంగతేంటి?
ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..
![Movie Shooting Updates : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? దేవర, విశ్వంభర, పుష్ప 2, గేమ్ ఛేంజర్ సంగతేంటి? Movie Shooting Updates : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? దేవర, విశ్వంభర, పుష్ప 2, గేమ్ ఛేంజర్ సంగతేంటి?](https://10tv.in/wp-content/uploads/2024/06/vihwambhara-pushpa.jpg)
Devara Game Changer Vishwambhara Pushpa and So Many Movies Shooting Updates
Movie Shooting Updates : సమ్మర్ లో అన్నీ చిన్న చిన్న సినిమాలే థియేటర్స్ లో సందడి చేసాయి. స్టార్ హీరోల సినిమాలు అన్ని షూటింగ్ చివరి దశల్లో ఉన్నాయి. జూన్ 27 కల్కి సినిమా నుంచి మొదలుపెట్టి నెలకొక భారీ సినిమా రిలీజ్ కాబోతున్నాయి. దీంతో పెద్ద సినిమాల షూటింగ్స్ అన్ని శరవేగంగా జరుగుతున్నాయి.
ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..
#ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. జాన్వీ, ఎన్టీఆర్ మధ్య లవ్ ట్రాక్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది.
#అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రగతి రిసార్ట్స్ లో జరుగుతుంది.
#రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూట్ పూర్తవుతుందని సమాచారం.
#నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా షూట్ హైదరాబాద్ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
#గోపీచంద్ శ్రీను వైట్ల సినిమా షూటింగ్ మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.
Also Read : NBK 109 Update : బాలకృష్ణ NBK 109 అప్డేట్ వచ్చేసింది.. అదిరిపోయిన గ్లింప్స్..
#ధనుష్, నాగార్జున – శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కుతున్న కుబేర సినిమా షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోలో జరుగుతుంది
#శర్వానంద్, అభిలాష్ కంకర కాంబోలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.
#సూర్య నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కంగువ షూటింగ్ కూడా ఇక్కడే హైదరాబాద్ లో పఠాన్ చెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.
#చిరంజీవి విశ్వంభర మూవీ కొత్త షెడ్యూల్ ఈ నెల 12నుంచి మొదలుకానుంది. అన్నపూర్ణ 7ఎకర్స్ లో విశ్వంభర షూట్ జరగనుంది.
Also Read : Vijay Deverakonda : అమెరికాలో ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు..