IND vs PAK : పాక్ పై భార‌త్ విజ‌యం.. న్యూయార్క్ పోలీసుల‌కు ఢిల్లీ పోలీసుల ట్వీట్‌..

భార‌త విజ‌యం పై ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది.

IND vs PAK : పాక్ పై భార‌త్ విజ‌యం.. న్యూయార్క్ పోలీసుల‌కు ఢిల్లీ పోలీసుల ట్వీట్‌..

Delhi Police Tweet To New York Police After India Win Over Pakistan

India vs Pakistan : న్యూయార్క్‌లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన ఉత్కంఠ పోరులో పాక్ పై భార‌త్ 6 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో రోహిత్ సేన‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌త అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. భార‌త్ గెలుపుతో పాకిస్తాన్ సూప‌ర్ 8 ఆశ‌లు సంక్లిష్టంగా మారాయి. అదే స‌మ‌యంలో టీమ్ఇండియా సూప‌ర్‌8కి మ‌రింత చేరువైంది. పాక్ పై విజ‌యంతో సంబురాలు మొద‌ల‌య్యాయి.

ఈ క్ర‌మంలో భార‌త విజ‌యం పై ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది. ‘మేము రెండు శ‌బ్దాల‌ను విన్నాము.. అందులో ఒక‌టి ఇండియా.. ఇండియా.. రెండోది బ‌హుశా టీవీల‌ను ప‌గ‌ల‌గొట్టిన సౌండ్ కావొచ్చు.. ద‌య‌చేసి మీరు దీన్ని నిర్ధారించ‌గ‌ల‌రా.’ అంటూ న్యూయార్క్ పోలీసుల‌ను ట్యాగ్ చేసింది. ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. కాగా.. భార‌త్ పై పాకిస్తాన్ ఓడిపోతే గ‌తంలో కొంద‌రు అభిమానులు త‌మ టీవీల‌ను ప‌గ‌ల‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.

Pakistan : భార‌త్ చేతిలో ఓట‌మి.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్‌..?

న్యూ యార్క్‌లోని నాసావు కౌంటీ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత, త్రివర్ణ పతాకం ప్రకాశవంతంగా ఎగుర‌డంతో వేదిక వ‌ద్ద‌ ఉన్న అభిమానులు డ్ర‌మ్స్ వాయిస్తూ ఆనందంతో నాట్యం చేశారు. భార‌త ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల టీమ్ఇండియా సూప‌ర్ ఫ్యాన్ అయిన సుధీర్ కుమార్ చౌద‌రి ఎంతో సంతోషం వ్య‌క్తం చేశాడు.

ఇది న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌డం లేదు. భార‌త్ 119కే ఆలౌట్ కావ‌డంతో పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో సుల‌భంగా గెలుస్తుంద‌ని తాను భావించిన‌ట్లు చెప్పాడు. ఇది చారిత్రాత్మ‌క మ్యాచ్. బుమ్రాతో పాటు మిగిలిన బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు అని అత‌డు ఏఎన్ఐకి చెప్పాడు.

IND vs PAK : పాక్ పై విజ‌యం.. భార‌త బ్యాట‌ర్ల‌పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. ఒక్క‌రైనా..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. 19 ఓవ‌ర్ల‌లో 119 ప‌రుగుల‌కు ఆలౌటైంది. రిష‌బ్ పంత్ (42) టాప్ స్కోర‌ర్‌. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 113 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా మూడు వికెట్లు తీశాడు.