Kalki Bujji Vehicle : చిన్ని సైజ్ రోబోటిక్ ‘బుజ్జి’ని తయారుచేసిన ఇంజనీర్.. ఎలా చేయాలో కూడా చెప్పేసాడు..
ఓ రోబోటిక్ ఇంజనీర్ తాజాగా చిన్న సైజు బుజ్జి వెహికల్ ని తయారుచేసాడు.
![Kalki Bujji Vehicle : చిన్ని సైజ్ రోబోటిక్ ‘బుజ్జి’ని తయారుచేసిన ఇంజనీర్.. ఎలా చేయాలో కూడా చెప్పేసాడు.. Kalki Bujji Vehicle : చిన్ని సైజ్ రోబోటిక్ ‘బుజ్జి’ని తయారుచేసిన ఇంజనీర్.. ఎలా చేయాలో కూడా చెప్పేసాడు..](https://10tv.in/wp-content/uploads/2024/07/kalki-bujji.jpg)
Robotic Engineer Made Small Size Bujji Vehicle of Kalki Prabhas Bujji Vehicle
Kalki Bujji Vehicle : కల్కి సినిమాలో ప్రభాస్ నడిపిన బుజ్జి వెహికల్ అందరికి నచ్చేసింది. నాగ్ అశ్విన్ చాలా కొత్త ఆలోచనతో మహీంద్రా కంపెనీ సహకారంతో ఈ బుజ్జి వెహికల్ ని దాదాపు 6 కోట్లు ఖర్చుపెట్టి తయారుచేశారు. సినిమాలో బుజ్జి చేసే యాక్షన్ సీన్స్ అందరిని మెప్పించాయి. పిల్లలకు అయితే బుజ్జి వెహికల్ బాగా నచ్చేసింది. ఈ వెహికల్ కి కీర్తి సురేష్ వాయిస్ పెట్టి, దానితో కామెడీ చేయించి నవ్వించారు కూడా.
Also Read : Kalki Ticket Rates : ‘కల్కి’ సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయా?
అయితే ఇలాంటి ఫేమస్ వెహికల్స్ వచ్చినప్పుడు వాటికి బొమ్మల రూపంలో మార్కెట్లో చాలా వస్తాయి. అవి కేవలం పిల్లలు ఆడుకోడానికి సింపుల్ గా ఎలాంటి మెకానిజం లేకుండా తయారుచేస్తారు. అయితే ఓ రోబోటిక్ ఇంజనీర్ తాజాగా చిన్న సైజు బుజ్జి వెహికల్ ని తయారుచేసాడు. తనకున్న రోబిటిక్ నాలెడ్జి, కోడింగ్ నాలెడ్జి ఉపయోగించి అచ్చం కల్కి సినిమాలో కనపడిన బుజ్జి వెహికల్ లాగే తయారుచేసాడు. అంతే కాకుండా ఈ రోబోటిక్ బుజ్జిని ఎలా తయారుచేయాలో కూడా వీడియోల రూపంలో చెప్పాడు. ఈ బుజ్జి ఆపరేటింగ్ కి కావాల్సిన కోడింగ్ కూడా ఇచ్చాడు.
View this post on Instagram
దీంతో ఈ బుజ్జి వీడియోలు వైరల్ గా మారాయి. అచ్చం కల్కి బుజ్జి వెహికల్ లాగే చిన్న సైజ్ బుజ్జిని భలే తయారుచేసాడు అంటూ దీనిని చేసిన ఇంజనీర్ పర్వేజ్ హుస్సేన్ ని అభినందిస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఈ వెహికల్ లో ఉండే కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చిన చిన్న బుజ్జి రోబోని తయారుచేసే పనిలో పడ్డాడు. పలువురు అభిమానులు, నెటిజన్లు.. బుజ్జి వెహికల్ ని ఇతను భలే తయారుచేసాడని, ఈ వీడియోలు మూవీ టీమ్ వరకు వెళ్లాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి అతను షేర్ చేసిన వీడియోలతో మీరు కూడా బుజ్జి ఎలా తయారు చేయాలో ట్రై చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చూసేయండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram