Maruti Suzuki Swift : కొత్త కారు కొంటున్నారా? ఈ పాపులర్ స్విఫ్ట్ మోడల్‌పై అదిరే డిస్కౌంట్.. వేరియంట్ల వారీగా ధర ఎంతంటే?
Maruti Suzuki Swift : ఈ హ్యాచ్‌బ్యాక్ కొత్త జెడ్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 82పీఎస్ పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఎఎంటీ ఉన్నాయి.
![Maruti Suzuki Swift : కొత్త కారు కొంటున్నారా? ఈ పాపులర్ స్విఫ్ట్ మోడల్‌పై అదిరే డిస్కౌంట్.. వేరియంట్ల వారీగా ధర ఎంతంటే? Maruti Suzuki Swift : కొత్త కారు కొంటున్నారా? ఈ పాపులర్ స్విఫ్ట్ మోడల్‌పై అదిరే డిస్కౌంట్.. వేరియంట్ల వారీగా ధర ఎంతంటే?](https://10tv.in/wp-content/uploads/2024/07/This-popular-new-car-has-offers-up-to-Rs-17k.-Not-XUV-3XO-Fronx-Exter-Elevate.jpg)
This popular new car has offers ( Image Source : Google )
Maruti Suzuki Swift : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తమ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. గత మేలో 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గో జనరేషన్ మోడల్‌ను లాంచ్ చేసింది. అప్పటి నుంచి మార్కెట్లో ఈ మోడల్ కారుకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
గత రెండు నెలల్లో 35,815 యూనిట్ల వద్ద వాల్యూమ్లను సంపాదించింది. మీరు ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. హ్యాచ్‌బ్యాక్‌పై ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మారుతి 2024 స్విఫ్ట్ కారు తయారీ కోసం మొత్తం రూ.1,450 కోట్ల పెట్టుబడి పెట్టింది.
ఈ హ్యాచ్‌బ్యాక్ కొత్త జెడ్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 82పీఎస్ పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఎఎంటీ ఉన్నాయి. కొత్త స్విఫ్ట్ అన్ని ఎంటీ, ఎఎంటీ వేరియంట్లు మొత్తం 17,100 రూపాయల తగ్గింపుతో ఉన్నాయి.
ఇందులో రూ. 15వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2,100 వరకు సంస్థాగత విక్రయాల ఆఫర్ అందిస్తుంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ LXi, VXi, VXi(O), ZXi, ZXi+ అనే ఐదు వేరియంట్లలో వస్తుంది. వేరియంట్ వారీగా 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
- స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ ఎంటీ – రూ. 6.49 లక్షలు
- స్విఫ్ట్ విఎక్స్ఐ ఎంటీ – రూ. 7.29 లక్షలు
- స్విఫ్ట్ విఎక్స్ఐ ఎఎంటీ – రూ. 7.74 లక్షలు
- స్విఫ్ట్ విఎక్స్ఐ (o) ఎంటీ – రూ. 7.56 లక్షలు
- స్విఫ్ట్ విఎక్స్ఐ (o) ఎఎంటీ – రూ. 8.01 లక్షలు
- స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఎంటీ – రూ. 8.29 లక్షలు
- స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఎఎంటీ – రూ. 8.74 లక్షలు
- స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎంటీ – రూ. 8.99 లక్షలు
- స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ+ ఎఎంటీ – రూ. 9.44 లక్షలు
- స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ+ ఎంటీ డ్యూయల్ టోన్ – రూ. 9.14 లక్షలు
- స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ+ ఎఎంటీ డ్యూయల్ టోన్ – రూ. 9.59 లక్షలు
మొత్తం రూ. 1,450 కోట్లతో అభివృద్ధి చేసింది. 2024 స్విఫ్ట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), EBD, హిల్-హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ABS వంటి సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. కొత్త స్విఫ్ట్ బూమరాంగ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, 15-అంగుళాల ప్రెసిషన్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్‌లతో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో ఫ్రంట్ గ్రిల్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లతో వస్తుంది. క్యాబిన్ లోపల స్మార్ట్‌పే ప్రో ప్లస్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4.2-అంగుళాల ఎంఐడీతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, ఆర్కమైస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో పనిలేదు.. ధర ఎంతంటే?