Tollywood Friendships : ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. సినీ పరిశ్రమలో వీళ్ళ ఫ్రెండ్‌షిప్ చాలా స్పెషల్ గురూ..

తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి స్నేహితులు కొందరున్నారు.

Tollywood Friendships : ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. సినీ పరిశ్రమలో వీళ్ళ ఫ్రెండ్‌షిప్ చాలా స్పెషల్ గురూ..

Tollywood stars Friendships Special Story on Friendship Day

Tollywood Friendships : సినీ స్టార్స్ అంటే కాల్ షీట్లు, షూటింగ్ లు, డబ్బింగ్ లు, ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటారు. సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ కలెక్షన్లు, రికార్డులు, అవార్డులు, నెక్ట్స్ మూవీ ప్లానింగ్ ఇలా లైఫ్ అంతా క్షణం తీరిక లేకుండా సాగుతుంది. ఇలాంటి బిజీ లైఫ్ లో కూడా సినీ స్టార్స్ కి మంచి స్నేహాలు ఉంటాయి. వాళ్లకు కూడా బెస్టీస్ ఉంటారు. సమయం కుదుర్చుకొని మరీ సరదగా కలుస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి మంచి స్నేహితులు కొందరున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకధీరుడు రాజమౌళి ఫ్రెండ్‌షిప్ గురించి టాలీవుడ్ అంతటికీ తెలిసిందే. స్టూడెంట్ నెంబర్ 1 తో కుదిరిన వీరి దోస్తీ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకే ఏజ్ గ్రూప్ కాకపోయినా వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాలను ఒకరితో మరొకరు షేర్ చేసుకుంటూ తమ స్నేహాన్ని బలంగా మార్చుకున్నారు.

రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ అయిన డార్లింగ్ ప్రభాస్ కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆయన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ప్రభాస్ ఇష్టపడే దోస్తు హీరో గోపీచంద్. గోపీచంద్ కు సంబంధించిన సినిమా ఈవెంట్ జరిగితే చాలు ప్రభాస్ అక్కడ వాలిపోతాడు. స్వయంగా ప్రభాసే గోపీచంద్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ప్రకటించాడు. వీరి ఇద్దరి ఫ్రెండ్‌షిప్ కూడా అభిమానులకు, ఆడియెన్స్ కు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాగే ప్రభాస్ రాజమౌళితోనూ క్లోజ్ గా మూవ్ అవుతారు. చత్రపతి సినిమాతో వీరి ఇధ్దరి ఫ్రెండిషిప్ కుదురింది. ఇక బాహుబలి సినిమాతో వీరి స్నేహం మరింత బలపడింది.

Also Read : Ram Charan : RRRలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ చూశారా? ఆ సీన్స్ రిలీజ్ చేయమని రాజమౌళికి ఫ్యాన్స్ రిక్వెస్ట్..

ఇండస్ట్రీలో మరో దోస్తీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – రానా. వీరిద్దరూ వెండితెరకు పరిచయం కాకముందు నుంచే ఎంతో మంచి స్నేహితులు. చిన్నప్పుడు వీరిద్దరూ ఒకే స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఇప్పటికీ వీరు పలు ఈవెంట్లు, పార్టీలకు కలిసి వెళ్తూనే ఉంటారు. రామ్ చరణ్ కు రానా బెస్ట్ ఫ్రెండ్ కాగా అంతే మైత్రీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయం రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో బహిర్గతమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో వీరిద్దరూ ఎలా కలిసి ఉన్నారో, పుట్టిన రోజులను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వారి ఫ్యాన్స్ చూసి తెగ సంబరపడిపోయారు. అంతేకాకుండా హీరో శర్వానంద్ తోనూ రామ్ చరణ్ కు మంచి ఫ్రెండిషిప్ ఉంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత దగ్గరగా ఉంటారో తెలిసిందే. వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ కి ఇండస్ట్రీనే ఫిదా అవుతోంది. పవన్ కళ్యాణ్ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ త్రివిక్రమ్ సలహాలు, సూచనలు చేస్తుంటారు. అలాగే స్పెషల్ డేల్ లో వీరు ప్రత్యేకంగా కలిసి సమయం గడుపుతుంటారు. త్రివిక్రమ్ మాటలు పవన్ కళ్యాణ్ నోటి వెంట వినడానికి ఫ్యాన్స్ ఇష్టపడతారు.

Also Read : Rajasaab – Malavika Mohanan : ‘రాజా సాబ్’ సెట్స్‌లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ప్రభాస్ ఎక్కడ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇండస్ట్రీలో బాగా దగ్గరైన వ్యక్తి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. వీరి మధ్య ఫ్రెండ్‌షిప్ దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇండస్ట్రీ వరకే పరిమితమైన ఈ విషయాన్ని ఇటీవల అల్లు అర్జున్ ఓ టీవీ షోలో బయటపెట్టారు. బన్నీ తన పర్సనల్ విషయాలను కేవలం దర్శకుడు సుకుమార్ తోనే షేర్ చేసుకుంటారంట.

ఇక మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఫ్రెండిషిప్ గురించి వేరే చెప్పనక్కరలేదు. ప్రొఫెషనల్ గా వాళ్ళ మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ మాత్రం చెక్కుచెదరలేదు. సినిమాల్లో కలిసి నటించకపోయినా ఎన్నో టీవీ షోల్లో వాళ్లు తమ బంధాన్ని బాహ్యప్రపంచానికి చాటి చెబుతూ వచ్చారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది స్నేహితులు ఉన్నారు.