AAY : ఎన్టీఆర్ బామ్మర్ది కోసం హీరో నిఖిల్‌..

ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ మ్యాడ్ మూవీతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు.

AAY : ఎన్టీఆర్ బామ్మర్ది కోసం హీరో నిఖిల్‌..

AAY pre release event Nikhil Siddhartha chief guest

AAY pre release event : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ మ్యాడ్ మూవీతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ఆయ్‌. అంజి కె ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని జీఏ 2 పిక్చర్స్‌ పతాకంపై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. నయన్‌ సారిక కథానాయిక న‌టిస్తోంది. ఈ చిత్రం ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేటి (ఆగ‌స్టు13న‌) సాయంత్రం నిర్వ‌హించ‌నున్నారు. హైద‌రాబాద్‌లోని ద‌స‌ప‌ల్లాలో గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ రానున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ను పంచుకుంది.

EVOL : సెన్సార్ దెబ్బ‌కి ఓటీటీ బాట ప‌ట్టిన బోల్డ్ సినిమా.. ట్రైల‌రే ఇలా ఉంటే.. ఇక మూవీలో..!

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇప్ప‌టికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకు తన బెస్ట్ విషెస్ తెలియ‌జేశారు. తనకు అత్యంత సన్నిహితులైన బన్నీ వాస్, విద్యా కొప్పినీడిలకు ఆయ్ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకున్నారు.