Niharika : నిహారిక ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సినిమాల్లోకి రాకముందు ఎక్కడ పనిచేసిందంటే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక ఫస్ట్ సంపాదన గురించి అడగ్గా తాను సినిమాల్లోకి, టీవీ షోలోకి రాకముందు చేసిన పని గురించి తెలిపింది.

Niharika : నిహారిక ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సినిమాల్లోకి రాకముందు ఎక్కడ పనిచేసిందంటే..

Do You Know Niharika Konidela First Salary and First Work Details Here

Niharika : మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా, నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ సాధించి హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నిహారిక తన గురించి, మెగా ఫ్యామిలీ గురించి కూడా బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక ఫస్ట్ సంపాదన గురించి అడగ్గా తాను సినిమాల్లోకి, టీవీ షోలోకి రాకముందు చేసిన పని గురించి తెలిపింది. నిహారిక మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోనే ఓ కేఫ్ లో పనిచేసాను. అక్కడ నాకు వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అని తెలిపింది. నన్ను మా నాన్న ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. అందుకే ఇక్కడే చదివాను, ఇక్కడే పనిచేసాను అని తెలిపింది.

Also Read : Kalki 2898AD : చిరంజీవి పుట్టిన రోజున ఓటీటీలో కల్కి సినిమా.. అధికారిక ప్రకటన..

ఇక నిహారిక ఢీ షోలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి టీవీ షోలు, సినిమాలు, సిరీస్ లు చేస్తూనే ఉంది.