Viral Video : ఆపిల్ ఐఫోన్ కోసం కొడుకు నిరాహారదీక్ష.. కండిషన్ పెట్టి కొనిచ్చిన పూలు అమ్మే తల్లి..!

Flower Seller Son : ఐఫోన్ కొనివ్వాలంటూ ఓ యువకుడు తన తల్లిని వేధించాడు. ఆమె గుడి ముందు పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అలాంటి తల్లిని ఐఫోన్ కొనివ్వాలని మూడు రోజులుగా తిండి మానేసి నిరాహారదీక్ష చేశాడు.

Viral Video : ఆపిల్ ఐఫోన్ కోసం కొడుకు నిరాహారదీక్ష.. కండిషన్ పెట్టి కొనిచ్చిన పూలు అమ్మే తల్లి..!

Flower Seller Son : ఐఫోన్ కు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబిట్రీల వరకు ఐఫోన్ అంటే తెగ ఇష్టపడతారు. ఐఫోన్ కొనాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. కానీ, అందరికి ఐఫోన్ కొనేందుకు స్థోమత ఉండకపోవచ్చు. కొంతమంది తమ ఆర్థిక పరిస్థితికి మించి అత్యంత ఖరీదైన ఐఫోన్ కొనాలని భావిస్తుంటారు.

Read Also : Zomato Group Ordering : జొమాటోలో గ్రూపు ఆర్డరింగ్ ఫీచర్.. ఒకేసారి అందరూ ఆర్డర్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

ఇంట్లో తల్లిదండ్రులను కూడా కొనివ్వాలని ఒత్తిడి చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఐఫోన్ కొనివ్వాలంటూ ఓ యువకుడు తన తల్లిని వేధించాడు. ఆమె గుడి ముందు పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటుంది. అలాంటి తల్లిని ఐఫోన్ కొనివ్వాలని మూడు రోజులుగా తిండి మానేసి నిరాహారదీక్ష చేశాడు. కళ్ల ముందే కన్నకొడుకు తిండి తినకుండా ఉండటం చూసి తల్లి తల్లడిల్లిపోయింది.

ఐఫోన్ కోసం 3 రోజులు తిండి మానేసి :
కొడుకుపై ప్రేమతో స్థోమత లేకపోయినా ఎంత కష్టమైనా చివరికి ఐఫోన్ కొనిచ్చింది తల్లి.. ఇప్పుడు దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గుడి ముందు పూలు అమ్మే తల్లి స్థోమత గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఐఫోన్ కావాలని కొడుకు పట్టుబట్టడాన్ని నెటిజన్లు మండిపడుతున్నారు.

వైరల్ అవుతున్న క్లిప్‌లో పూలు అమ్మే తల్లి, కొడుకు ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి మొబైల్ స్టోర్‌లో నిలబడి ఉండటం కనిపిస్తుంది. అతని తల్లి పరిస్థితిని వివరించగా మొబైల్ షాప్ వ్యక్తి అతని ఐఫోన్ ఎంపిక గురించి ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఐఫోన్ కొనుగోలు చేయాలని తన కొడుకు 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడని ఆమె తెలిపారు. “నేను గుడి బయట పూలు అమ్ముతాను. నా కొడుకు తనకు ఐఫోన్ కావాలి. కాబట్టి మూడు రోజులుగా ఏమీ తినలేదు” అని ఆమె వాపోయింది.

ఐఫోన్ కొనేందుకు తల్లి షరతు :
చేసేది ఏమిలేక చివరికి అతడి డిమాండ్‌కు తాను అంగీకరించానని, ఫోన్ కొనేందుకు డబ్బులు ఇచ్చానని తల్లి తెలిపింది. అయితే, ఆమె పరిస్థితి అదుపు తప్పలేదు. తన కొడుకు ఫోన్ బిల్లుతో సమానమైన డబ్బు సంపాదించి తనకు తిరిగి ఇవ్వాలని గట్టిగా చెప్పింది. “నేను సంతోషంగా ఉన్నాను. కానీ, అతను సంపాదించి డబ్బు తిరిగి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. “అధిక ప్రేమ పిల్లలను నాశనం చేస్తుంది. పిల్లలకు ఏది ఇవ్వాలి? వద్దు అనేది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఏ తల్లి దండ్రి అయినా అతనిలాంటి పిల్లలకు అర్హులు కాదు” అని క్యాప్షన్ ఇచ్చారు.

తల్లి ఆవేదనపై నెటిజన్ల రియాక్షన్ :
ఇప్పటివరకూ ఈ వీడియోకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 6 లక్షల వ్యూస్, 10వేల లైక్‌లు వచ్చాయి. చాలా అవమానకరం.. అమ్మ అతనిని డబ్బుకు బదులు చెప్పులతో కొట్టాలి. ఆకలితో అతడు అలమటించాలి. ఈ స్వార్థపరులు దురాశ కోసం తమ తల్లిదండ్రులను అమ్ముకోవడానికి కూడా వెనుకాడరు” అని మరో యూజర్ కామెంట్ చేశాడు.

“ఆ తల్లి కోసమైనా జాలిపడండి.. ఆమె తన బాధను వివరిస్తుంది. అంత డబ్బు సంపాదించడానికి తన తల్లి ఎంత కష్టపడిందో కూడా అతనికి తెలియదు. బాధ్యత, గౌరవం లేకుండా పెరిగే ఇలాంటి పిల్లలు, వారి తల్లిదండ్రులను చివరికి వృద్ధాశ్రమాలలో విడిచిపెడతారు” అని మరో యూజర్ పోస్టు చేశాడు. 

Read Also : Jharkhand Truck Driver : ట్రక్ డ్రైవర్.. వంటల వీడియోలతో ఫేమస్ అయ్యాడు.. నెలకు రూ. 10 లక్షలు సంపాదన..!