Chinese Parents Reunite : 37ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకును కలుసుకున్న తల్లిదండ్రులు.. తీవ్ర భావోద్వేగం..!

Chinese Parents Reunite : చైనాలోని ఒక జంట 37 ఏళ్ల తర్వాత వారి కొడుకుతో తిరిగి కలిశారు. 1986లో బాలుడు వారి నుంచి దూరమయ్యాడు. ఆ బాలుడి తండ్రి తరపు నానమ్మ బిడ్డను ఇతరులకు అమ్మేసింది.

Chinese Parents Reunite : 37ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకును కలుసుకున్న తల్లిదండ్రులు.. తీవ్ర భావోద్వేగం..!

After 37-Year Search, Chinese Parents Reunite With Long-Lost Son ( Image source : Google Images )

Chinese Parents Reunite : పుట్టిన పిల్లలను కోల్పోతే కలిగే ఆ బాధ.. తల్లిదండ్రుల్లో తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. దూరమైన కొడుకు ఇక రాడు అని తెలిసిన తల్లిదండ్రులకు వారి కుమారుడు మళ్లీ తారసపడితే కలిగే ఆనందం అంతాఇంతా కాదు.. అదో అద్భుతమైన క్షణం..

ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 37 ఏళ్ల తర్వాత కోల్పోయిన కొడుకు తిరిగి రావడం మాటల్లో చెప్పలేనిది. ఇటీవలే అలాంటి హృదయపూర్వక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. చైనాలోని ఒక జంట 37 ఏళ్ల తర్వాత వారి కొడుకుతో తిరిగి కలిశారు. 1986లో బాలుడు కేవలం ఒకరోజు వయస్సులో ఉన్నప్పుడు వారి నుంచి దూరమయ్యాడు. ఆ బాలుడి తండ్రి తరపు నానమ్మ ద్వారా బిడ్డను అమ్మేశారు.

Read Also : Massive Power Outage : పాము చేసిన పనికి భారీ విద్యుత్తు అంతరాయం.. అమెరికాలో 11వేల మంది అంధకారంలోకి..!

అప్పట్లో, బాలుడి నానమ్మ.. అతడి తల్లిదండ్రులు మరో బిడ్డను పెంచే సామర్థ్యం లేదని భావించి జావో అనే ఇంటిపేరు గల వ్యక్తి కుటుంబానికి ఇచ్చింది. బాలుడి తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి అంగీకరించలేదు. వారికి అప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నందున, మరో బిడ్డను చూసుకోవడం చాలా సవాలుగా ఉంటుందని భావించి, వారి తరపున ఎంపిక చేసినట్లు ఆమె తరువాత వివరించింది.

ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా అమ్మేసింది. అయితే, జావో కుటుంబం బాలుడి నానమ్మకు ఎంత డబ్బు చెల్లించిందనే విషయంపై స్పష్టత లేదు. 37ఏళ్లుగా తమ కొడుకు కోసం వెతకని చోటు లేదు. ఎట్టకేలకు ఆ చైనీస్ తల్లిదండ్రులు కోల్పోయిన తమ కొడుకుతో తిరిగి కలుసుకున్నారు. మరో బిడ్డను భరించే స్థోమత లేదని నమ్మిన అమ్మమ్మ అతడిని వేరే కుటుంబానికి అమ్మేసింది.

నివేదిక ప్రకారం.. నానమ్మ మరణించిన తర్వాత లి, అతని భార్య మూడు దశాబ్దాల పాటు తమ తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతూ తిరిగారు. ఫిబ్రవరిలో, పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ డేటాబేస్ ప్రకారం.. ఈ జంట రక్త నమూనాలు షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని జావోజువాంగ్‌లో నివసిస్తున్న పాంగ్ అనే ఇంటిపేరుతో ఉన్న వ్యక్తికి సరిపోలినట్లు గుర్తించారు.

చైనా పోలీసు అధికారులు 2009లో పిల్లలు తప్పిపోయిన జంటలు, వారి జీవసంబంధమైన తల్లిదండ్రులను కనుగొనాలనుకునే వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం ద్వారా పెద్ద డీఎన్ఏ డేటాబేస్‌ను ఏర్పాటు చేసింది. ఈ జంట జీవసంబంధమైన తల్లిదండ్రులు అని నిర్ధారించే ముందు రెండుసార్లు రక్తం ఇవ్వాలని షాంగ్సీలోని పోలీసులు లీ, అతని భార్య పాంగ్‌ని కోరారు.

ఆగష్టు 3న, పోలీసు అధికారుల సాయంతో పాంగ్ తన తల్లిదండ్రులను వీనాన్‌లో కలుసుకున్నాడు. అక్కడ అతను 37 సంవత్సరాల క్రితం జన్మించాడు. “కొడుకును చూడగానే తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.. మమ్మల్ని క్షమించు.. ఇన్నాళ్లూ నీ జీవితం ఎలా గడిచింది? నాయనా అంటూ వారిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొడుకు పాంగ్‌ని కౌగిలించుకుని అతని చేతులను గట్టిగా పట్టుకున్నారు. ఈ అపూర్వ కలయిక సంబంధించిన వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లలో ఒకరు “బాలుడి నానమ్మ చాలా క్రూరమైనది. ఆమె తన సొంత మనవడిని అమ్మేసింది. ఆమె చర్యలను అర్థం చేసుకోవడం కష్టం” అని వీబోలో రాశాడు. మరికొందరు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. “తల్లిదండ్రులను కలిసిన కొడుకు వారితో కొద్దిగా ఇబ్బంది పడినట్లు కనిపిస్తాడు. అతనిని పెంచని అసలైన తల్లిదండ్రుల పట్ల అతనికి ఎలాంటి భావాలు లేవు” అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

Read Also : Viral Video : స్కూల్ రోజులు గుర్తుకొస్తున్నాయి.. ప్రిన్సిపాల్‌ చేత బెత్తంతో కొట్టించుకున్న పూర్వ విద్యార్థులు..!