Kolkata Doctor Case : కోల్‌కతా హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ప్రశ్నల వర్షం

విద్యార్థిని తల్లిదండ్రులకు బలవన్మరణం అని చెప్పింది ఎవరు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది.

Kolkata Doctor Case : కోల్‌కతా హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ప్రశ్నల వర్షం

supreme court

Kolkata Doctor Case : కోల్ కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. ఆసుపత్రిని ధ్వంసం చేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఐ నమోదు ఎందుకు ఆలస్యమైందని న్యాయస్థానం ప్రశ్నించింది.

Also Read : Kolkata Doctor Incident : కోల్‌కతా వైద్యరాలి హత్యాచార ఘటనపై సౌరవ్ గంగూలీ వినూత్న రీతిలో నిరసన

విద్యార్థిని తల్లిదండ్రులకు బలవన్మరణం అని చెప్పింది ఎవరు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ అంటూ కోర్టు ప్రశ్నించింది. ప్రిన్పిపాల్ రాజీనామా చేసినా వేరే కాలేజీకి ఎందుకు నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యార్థిని తల్లిదండ్రులను 3గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించారు. క్రైమ్ సీన్ ను ఎందుకు సీల్ చేయలేక పోయారు? అత్యాచారం, హత్యను బలవన్మరణంగా ఎందుకు చిత్రీకరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎందుకు ఆలస్యమైందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాధితురాలి కుటుంబ సభ్యులు రాత్రి 8.30 గంటలకు ఆమె మృతదేహాన్ని స్వీకరించారు.. రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకుముందు ఆసుపత్రి యాజమాన్యం ఏం చేస్తోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Also Read : వైద్యురాలిపై హత్యాచార ఘటన.. హర్భజన్ సింగ్ పోస్టుకు బెంగాల్ గవర్నర్ స్పందన

ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతియుత నిరసనకారులపై అధికారం చెలాయించొద్దని సూచించింది. ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. వైద్యులు, పౌరసమాజాన్ని అడ్డుకోవడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం మందలించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై ఆగస్టు 22వ తేదీ (గురువారం) లోగా నివేదిక సమర్పించాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేసింది.

దేశం మొత్తం మీ భద్రత గురించి ఆందోళన చెందుతోందని వైద్య ఆందోళనను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ను నియమిస్తున్నట్లు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతపై అధ్యయనం చేసి సూచనలు ఇవ్వడం దీని పనిఅని తెలిపింది.