హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఫామ్‌హౌసేనా? హైడ్రా అసలు లక్ష్యం ఏంటి..

అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూల్చాలని.. రాజకీయ కక్ష సాధింపు కోసం హైడ్రాను వాడుకోవడం సరికాదంటున్నారు.

హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఫామ్‌హౌసేనా? హైడ్రా అసలు లక్ష్యం ఏంటి..

Gossip Garage : ఆక్రమణలకు అడ్డుకట్ట.. కబ్జాలకు బ్రేక్.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం.. ఇందుకోసమే పని చేస్తున్నాం అంటోంది హైడ్రా. ఔటర్ రింగ్ రోడ్ దాటి మరీ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. రాజకీయ కక్ష సాధింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ హైడ్రా అసలు లక్ష్యం ఏంటి? ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యమా? హైడ్రా ఏర్పాటులో పొలిటికిల్ ఎజెండా ఉందా? ప్రతిపక్ష నేతల టార్గెట్ గానే హైడ్రాను ఏర్పాటు చేశారు అన్న విమర్శల్లో నిజమెంత?

ముందుగా కాంగ్రెస్ నేతల ఫాంహౌస్‌లను కూల్చేయాలని కేటీఆర్ డిమాండ్.. టార్గెట్‌ను టార్గెట్‌ చేయాలంటే.. ముందుగా స్ట్రాటజీ ఫాలో కావాలి. అదే అటెన్షన్ డైవర్షన్. డైరెక్ట్‌గా టార్గెట్‌ మీద అటాక్ చేస్తే సిచ్యువేషన్‌ రివర్స్ కావొచ్చు. స్కెచ్‌ బూమరాంగ్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. అందుకే పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తుంది హైడ్రా. దీని ఏర్పాటు లక్ష్యం ఏదైనా సీఎం రేవంత్‌ టార్గెట్‌ మాత్రం క్లియర్ అంటున్నారు అపోజిషన్ లీడర్లు. హైడ్రాను స్వతంత్రంగా పని చేయనివ్వాలని.. ప్రతిపక్ష లీడర్లపై కక్ష తీసుకునేలా హైడ్రా చర్యలు ఉండొద్దని అంటున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే FTL, బఫర్‌ జోన్లలో కొందరు కాంగ్రెస్ లీడర్లతో పాటు, ఓ మంత్రి ఫాంహౌస్‌ కూడా ఉందని, తనతో వస్తే ఎవరి ఫాంహౌస్‌లు ఎక్కడ ఉన్నాయో చూపిస్తానంటున్నారు. ముందుగా కాంగ్రెస్ నేతల ఫాంహౌస్‌లను కూల్చివేసి.. తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మిగతా నిర్మాణాలను కూల్చివేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

హైడ్రా నెక్స్ట్‌ టార్గెట్‌ జన్వాడ ఫాంహౌస్?
అక్రమ నిర్మాణాలను వరుస పెట్టి కూల్చివేస్తుంది హైడ్రా. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తగ్గట్లేదు. ఇప్పుడు హైడ్రా అధికారులు ఔటర్ రింగ్ రోడ్డును దాటి కూల్చివేస్తున్నారు. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ FTL, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. దీని తర్వాత హైడ్రా నెక్స్ట్‌ టార్గెట్‌ జన్వాడ ఫాంహౌసేనన్న చర్చ జరుగుతోంది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్‌ జన్వాడ ఫాంహౌసేనని.. అందుకోసమే ఉస్మాన్‌సాగర్ పరిసరాల్లో కూల్చివేతలు స్టార్ట్ చేశారని ఆరోపిస్తున్నారు.

అధికారంలోకి వచ్చాక అదే జన్వాడ ఫాంహౌస్‌ టార్గెట్‌గా ఆపరేషన్‌..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జన్వాడ ఫాంహౌస్‌పై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్‌రెడ్డి. ఆ ఇష్యూలో పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగరవేశారని.. జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే జన్వాడ ఫాంహౌస్‌ టార్గెట్‌గా ఆపరేషన్‌ స్టార్ట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గండిపేట జలాశయం పరిధిలో ఉన్న జన్వాడ ఫాంహౌస్ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైందని రెండ్రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే జన్వాడ ఫాంహౌస్ ఓనర్ ప్రదీప్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. గురువారం వరకు జన్వాడ ఫాంహౌస్‌ను కూల్చివేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

రాజకీయ కక్ష సాధింపు కోసం హైడ్రాను వాడుకోవడం సరికాదు..
అయితే జంట జలశాయాల పరిసరాల్లో చాలామంది ప్రముఖులకు చెందిన నిర్మాణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో రేవంత్ క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి ఫాంహౌస్‌ కూడా హిమాయత్ సాగర్ FTL పరిధిలో ఉన్నట్లు ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు..దానిని ముందు కూల్చాలని డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా పరిధిలో కూల్చివేతలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్‌ వార్ కొనసాగుతోంది. బీజేపీ కూడా అధికార కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తోంది. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూల్చాలని.. రాజకీయ కక్ష సాధింపు కోసం హైడ్రాను వాడుకోవడం సరికాదంటున్నారు కమలం పార్టీ లీడర్లు.

ముందుగా జన్వాడ ఫామ్ హౌస్ కూలుస్తారా? లేక మంత్రి ఫాంహౌస్‌ కూలుస్తారా?
హైడ్రా కూల్చివేతల ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో రచ్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు హైడ్రా అధికారులు ఎలా వ్యవహరిస్తారనేది హాట్ టాపిక్ అయింది. ముందుగా జన్వాడ ఫామ్ హౌస్ కూలుస్తారా లేక మంత్రి ఫాంహౌస్‌ కూలుస్తారా అనేది త్వరలో తేలిపోనుంది. అంతేకాదు ఇప్పుడు హైడ్రా పరిధి ఎక్కడి వరకు అన్నదానిపై కూడా చర్చ మొదలైంది.

Also Read : మహిళా కమిషన్ వర్సెస్ కాంగ్రెస్ నేత..! చిచ్చు రాజేసిన వేణుస్వామి వ్యవహారం..!

గతంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు అని, తర్వాత ఔటర్ దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల వరకు అన్న వాదనలున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు అని చెప్పినా దానిని పెంచవచ్చు..తగ్గించవచ్చు అనే వెసులుబాటు ఉంది. అయితే GHMCతో పాటు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయని వాటి పరిధి వరకు అక్రమ నిర్మాణాలపై తాము చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నాయి హైడ్రా వర్గాలు.