Sneha – Pawan Kalyan : రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా.. పవన్ పై స్నేహ వ్యాఖ్యలు..
నిన్న రాత్రి GOAT సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా విజయ్ తప్ప మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈవెంట్లో స్నేహ మాట్లాడుతూ..
Sneha – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి పొగడని వాళ్ళు ఎవరుంటారు. ఆయనతో పనిచేసే వాళ్లే కాదు ఆయన మంచితనం, నిజాయితీ, ప్రజల కోసం పడే తపన చూసి ఎవరైనా ఆయన్ని పొగుడుతారు. నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్, నెటిజన్లు, సినీ ప్రముఖులు పవన్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే తమిళ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.
నిన్న రాత్రి GOAT సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా విజయ్ తప్ప మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సినిమాలో స్నేహ కూడా నటించింది. ఈవెంట్లో స్నేహ మాట్లాడుతుండగా మీరు పనిచేసిన సినిమా వాళ్ళల్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ఎవరు అని యాంకర్ అడిగింది.
Also Read : Nani : నా నెక్స్ట్ సినిమాలకు పిల్లల్ని రానివ్వరు.. నాని సంచలన వ్యాఖ్యలు..
స్నేహ మాట్లాడుతూ.. తెలుగులో ఆల్మోస్ట్ అందరితో పనిచేసాను ఒక ఇద్దరితో తప్ప. మెగాస్టార్ చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో పనిచేయలేకపోయాను. అందుకు నేను ఎప్పుడూ బాధపడతాను. ఇవాళ పవన్ గారి బర్త్ డే, హ్యాపీ బర్త్ డే విషెష్ ఆయనకు. ఆల్ టైం గ్రేటెస్ట్ పవన్ గారే. ఎందుకంటే రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను ఆయన పవర్ స్టారే అని అన్నారు. దీంతో స్నేహ చేసిన వ్యాఖ్యలని పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. పవన్ తో పనిచేయకపోయినా ఆయన గురించి గొప్పగా చెప్పింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#PawanKalyan garu is both the reel and real Power Star.
He's my GOAT.
– Actress, #Sneha pic.twitter.com/IpvfGjTzwK
— Gulte (@GulteOfficial) September 2, 2024