బుస కొట్టిన బుడమేరు, ముంచెత్తిన మున్నేరు.. తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలకు కారణం ఏంటి?

బుడమేరు పోటెత్తి ఎందుకు బెజవాడ మునిగింది? మున్నేరు ఉధృతి ఖమ్మంను ముంచడానికి కారణం ఏంటి?

బుస కొట్టిన బుడమేరు, ముంచెత్తిన మున్నేరు.. తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలకు కారణం ఏంటి?

Updated On : September 3, 2024 / 1:17 AM IST

Ap Telangana Floods : వాన వస్తే వరద వస్తుంది. వరద వస్తే ఇళ్లు, కాలనీలే కాదు.. పట్టణాలు, నగరాలూ మునిగిపోతున్నాయి. కుంభవృష్టి వాన, చెరువులను తలపించే వరద సిటీలను, పల్లెలను ముంచేస్తున్నాయి. వయనాడ్ లో వరంగల్ వరకు.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అని చోట్ల వరదలు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఏపీలో బుడమేరు, తెలంగాణలో మున్నేరు వాగు ఉధృతి అటు బెజవాడ ఇటు ఖమ్మం నగరాలను ఆగమాగం చేస్తున్నాయి. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ లు, నిలిచిపోయిన రాకపోకలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెజవాడలో వేలాది మంది ఇళ్లు వదిలి వేరే చోటకు వెళ్తుండగా.. ఖమ్మం నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఈ వరదలకు కారణం ఏంటి? ఆకస్మిక వరదలతో జరిగిన నష్టం ఎంత?

వానా కాలం అంటేనే వణికిపోయే పరిస్థితి. వర్షం కంటే వరదల భయమే ఎక్కువైంది. ఎప్పుడు ఏవైపు నుంచి వరద ముంచుకొస్తుందో తెలియదు. ఉప్పెనలా వాగులు ఉప్పొంగి గ్రామాలను, పట్టణాలను కమ్మేస్తున్నాయి. వరద వస్తే చాలు మునగాల్సిందే అన్న పరిస్థితి ఉంది. బుడమేరు పోటెత్తి ఎందుకు బెజవాడ మునిగింది? మున్నేరు ఉధృతి ఖమ్మంను ముంచడానికి కారణం ఏంటి? మున్నేరు వాగు ప్రొటెక్షన్ వాల్ ఏమైంది? బుడమేరు వాగు డైవర్షన్ సక్సెస్ కాలేదా? కబ్జాలే వరద రూపంలో కాటు వేస్తున్నాయా? బుల్డోజర్ రంగంలోకి దిగితేనే అంతా సెట్ అవుతుందా?

పూర్తి వివరాలు..

Also Read : 10 నిమిషాల వర్షానికే నదుల్లా కాలనీలు.. బెజవాడ మునిగింది అందుకేనా? ఇక్కడా బుల్డోజర్ దిగాల్సిందేనా?