AAY : ఏపీ వరద బాధితులకు ‘ఆయ్’ టీమ్ సాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు

AAY team helps AP flood victims
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయ్ మూవీ యూనిట్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిర్మాత బన్నీవాసు తెలియజేశారు.
ఆయ్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి నేటి (సెప్టెంబర్ 2) నుంచి వీకెండ్ వరకు వచ్చే కలెక్షన్లలో నిర్మాత షేర్‌లోని 25 శాతాన్ని జనసేన పార్టీ తరుపున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. చిత్ర బృందం మంచి మనసును ఈ సందర్భంగా నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Niharika – Anji : మెగాస్టార్ ‘అంజి’ సినిమాలో నిహారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్.. కానీ..
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన మూవీ ‘ఆయ్’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా అంజి కె.మణిపుత్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
In these tough times, we stand with the flood victims✊️
Team #AAYMovie and @GeethaArts will be donating 25% of the producer’s share from today until the weekend toward the relief of Andhra Pradesh flood disaster victims through @JanasenaParty ❤️
It’s time to show our… pic.twitter.com/tMLUsSpMkF
— Bunny Vas (@TheBunnyVas) September 2, 2024