Samsung Galaxy A06 : శాంసంగ్ గెలాక్సీ A06 కొత్త ఫోన్ చూశారా? ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy A06 Launch : ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్, 6.7-అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 25డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Samsung Galaxy A06 : శాంసంగ్ గెలాక్సీ A06 కొత్త ఫోన్ చూశారా? ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy A06 With MediaTek Helio G85 SoC, 50-Megapixel Camera Launched ( Image Source : Google )

Samsung Galaxy A06 Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త శాంసంగ్ గెలాక్సీ A06 ఫోన్ వచ్చేసింది. ప్రత్యేకించి ఎంపిక చేసిన ఆసియా మార్కెట్లలో ప్రవేశపెట్టిన కొద్ది రోజుల తర్వాత భారత్‌లో లాంచ్ అయింది.

Read Also : iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ చూశారా? కొత్త డిజైన్ అదుర్స్.. అధికారిక ఫొటో లీక్.. ఫీచర్లు ఇవేనా?

ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్, 6.7-అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 25డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. గత శాంసంగ్ గెలాక్సీ ఎ05 మాదిరిగానే పిన్‌స్ట్రిప్డ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. పవర్, వాల్యూమ్ బటన్‌ను కలిగిన రైట్ అంచున ఉన్న కీ ఐలాండ్ బంప్‌ను కలిగి ఉంది.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎ06 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎ06 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ.9,999కు అందిస్తుంది. అయితే, 4జీబీ+ 128జీబీ వేరియంట్ రూ. 11,499కు పొందవచ్చు. ఈ ఫోన్ శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. బ్లాక్, గోల్డ్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ06 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎ06 ఫోన్ 6.7-అంగుళాల హెచ్‌డీ+ (720 x 1,600 పిక్సెల్‌లు) పీఎల్ఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. శాంసంగ్ ఫోన్ మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించిన స్టోరేజీకి సపోర్టు ఇస్తుంది.

ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6తో వస్తుంది. కెమెరా విభాగంలో, శాంసంగ్ గెలాక్సా ఎ06 ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ06 ఫోన్ 25డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సైజులో 167.3 x 77.3 x 8.0ఎమ్ఎమ్, 189 గ్రాములు ఉంటుంది.

Read Also : Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్‌ ఎప్పుడో తెలిసిందోచ్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు మీకోసం..!