AUS vs SCO : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప‌సికూన స్కాట్లాండ్ పై ఆసీస్ బ్యాట‌ర్ల పెను విధ్వంసం

టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది.

AUS vs SCO : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప‌సికూన స్కాట్లాండ్ పై ఆసీస్ బ్యాట‌ర్ల పెను విధ్వంసం

AUS vs SCO

AUS vs SCO : టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. స్కాట్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో దీన్ని న‌మోదు చేసింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది. స్కాట్లాండ్ బ్యాట‌ర్ల‌లో మున్సె(16 బంతుల్లో 28 ప‌రుగులు) రాణించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో అబాట్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జేవియర్, జంపా చెరో రెండు వికెట్లు తీశారు.

అనంత‌రం ఓ మోస్త‌రు ల‌క్ష్య ఛేద‌న‌లో ఆసీస్ బ్యాట‌ర్లు దుమ్ములేపారు. ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్ (80; 25 బంతుల్లో, 12 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (39; 12 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోటాపోటీగా బౌండ‌రీలు బాదారు. వీరిద్ద‌రు చెల‌రేగ‌డంతో ఆసీస్ ప‌వ‌ర్ ప్లేలో ఓ వికెట్ కోల్పోయి 113 ప‌రుగులు చేసింది.

Rahul Dravid : రాజస్థాన్‌ రాయల్స్‌ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!

ఈ క్ర‌మంలో ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది. వీరిద్ద‌రితో పాటు జోష్ ఇంగ్లిష్ (13 బంతుల్లో 27 నాటౌట్‌) చెల‌రేగ‌డంతో ల‌క్ష్యాన్ని ఆసీస్ 9.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక స్కోర్లు..

ఆస్ట్రేలియా 113/1 vs స్కాట్లాండ్ (2024)
దక్షిణాఫ్రికా 102/0 vs వెస్టిండీస్ ( 2023)
వెస్టిండీస్ 98/4 vs శ్రీలంక (2021)
వెస్టిండీస్ 93/0 vs ఐర్లాండ్ (2020)
వెస్టిండీస్ 92/1 vs ఆఫ్ఘనిస్తాన్ (2024)

Gill-Ananya Pandey : శుభ్‌మ‌న్ గిల్‌తో బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే.. రియాన్ ప‌రాగ్‌ను ఆడుకుంటున్న నెటిజ‌న్లు