మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడ? ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

ఈ కేసులో జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దాంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడ? ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

Search For Jogi Ramesh : వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జోగి రమేష్‌, ఆయన అనుచరుల కోసం హైదరాబాద్‌లో వెతుకుతున్నారు. మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం ఏపీ పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో జోగి రమేష్‌ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. అయితే, ఆయన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దాంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అటు జోగి రమేష్ అనుచరుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also Read : ఆ ఆరుగురు పోలీసు అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్..! త్వరలో చర్యలు? ఎందుకో తెలుసా..

అటు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటికే వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో నందిగం సురేశ్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నందిగం సురేశ్ హైదరాబాద్ మియాపూర్ లో ఉన్నారని పక్కా సమాచారం సేకరించారు. తర్వాత మియాపూర్ వెళ్లి నందిగం సురేశ్ ను అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు ప్రత్యేక బృందాలతో విజయవాడలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. జోగి రమేశ్ హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో గత రాత్రి ప్రత్యేకంగా మూడు బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోగి రమేశ్ కోసం పోలీసులు గాలించారు. జోగి రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వెతుకుతున్నారు. జోగి రమేశ్ ప్రధాన అనుచరులను పోలీసులు టార్గెట్ చేశారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జోగి రమేశ్ ప్రధాన అనుచరులు కొంతమందిని ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు. జోగి రమేశ్ ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్లారు? ఎటు వెళ్లారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. కాగా, జోగి రమేశ్ రాష్ట్రం దాటి వెళ్లారని తెలుస్తోంది.