YS Jagan: వైఎస్ జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఇలా చేయటం చట్టవిరుద్ధమని కోర్టులో వాదనలు వినిపించారు.

YS Jagan: వైఎస్ జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్‌ వెళ్లడానికి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జగన్ 20 రోజులపాటు కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినట్టు కోర్టుకు జగన్ తరఫు న్యాయవాది తెలిపారు. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని పాస్ పోర్ట్ కార్యాలయం తెలిపింది.

ఎన్వోసీ తీసుకోవాలని జగన్‌కు పాస్ పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. పాస్ పోర్ట్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినా ప్రజా ప్రతినిధుల కోర్టు అనేక షరతులను విధించినట్టు కోర్టుకు జగన్ తరఫు న్యాయవాది తెలిపారు. ఇలా చేయటం చట్టవిరుద్ధమని కోర్టులో వాదనలు వినిపించారు. ఎన్వోసీ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కాగా, జగన్ 20 రోజులపాటు కుటుంబంతో కలిసి లండన్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అనుమతి కోరిన విషయం తెలిసిందే. లండన్‌లో కూతురురి చూడటానికి వెళ్లాలని జగన్ అన్నారు. జగన్ ఈ ఏడాదిలో విదేశీ పర్యటనకు అనుమతి కోరడం ఇది రెండోసారి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాక కూడా 15 రోజులు పాటు జగన్ విదేశాలకు వెళ్లి వచ్చారు.

Also Read: శ్రీవారి లడ్డూలను అక్కడ భక్తులకు అందుబాటులో ఉంచుతాం: టీటీడీ ఈవో