మోక్షజ్ఞ సినిమాలో ఎన్టీఆర్ రోల్ అదేనా? మూవీలో బాలకృష్ణ కూడా?

ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారంటున్నారు. అయితే తమ్ముడు పుట్టిన రోజు, తొలి సినిమా పోస్టర్‌ రిలీజ్‌..

మోక్షజ్ఞ సినిమాలో ఎన్టీఆర్ రోల్ అదేనా? మూవీలో బాలకృష్ణ కూడా?

Nandamuri Mokshagna: అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ప్రకటన వచ్చేసింది. మోక్షజ్ఞ తొలి సినిమా డైరెక్టర్‌పైన.. నిర్మాతలపైనా సస్పెన్స్‌ తొలగిపోయింది.. కానీ, ఈ సినిమాలో మరో ఇద్దరు ఐకాన్‌లు కూడా మెరవబోతున్నారట… గెస్ట్‌ రోలా… లేక సపోర్టింగ్‌ యాక్టరా? అన్నది ఇంకా స్పష్టత రాకపోయినా ఆ ఇద్దరు కూడా మోక్షజ్ఞ సినిమాలో ఉండబోతున్నారని… ఫ్యాన్స్‌కు కనువిందు చేయబోతున్నారనేదే ఇప్పుడు ఇండస్ట్రీ టాక్‌… ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో.. మోక్షజ్ఞ సినిమాలో వారి రోల్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం…

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ సినిమాపై గాసిప్స్‌ నడుస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలనే విషయంలో తర్జనభర్జన పడిన బాలయ్య… చివరికి హిట్‌ చిత్రాల దర్శకుడు… హను మ్యాన్‌ రూపశిల్పి ప్రశాంత్‌ వర్మకు చాన్స్‌ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజశ్విని నిర్మాతగా ఉండబోతున్నారు. ఐతే, మోక్షజ్ఞ సినిమా మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఇంకొన్ని స్పెషల్‌ ఎంట్రీలు ఉండాలని భావిస్తున్నారట బాలయ్య..

గెస్ట్‌ ఎపీరియన్స్‌గా?
నందమూరి సినిమా అనేవిధంగా ఆడియోన్స్ రిసివ్ చేసుకోవాలనే ఆలోచనతో బాలయ్య కూడా గెస్ట్‌ ఎపీరియన్స్‌గా సినిమాలో నటించాలని ప్లాన్‌ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్‌. ఇక మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం మోక్షజ్ఞ సినిమాకు బూస్టప్‌ ఇచ్చేలా స్పెషల్‌ రోల్‌లో కనిపించబోతున్నారని చెబుతున్నారు. పాన్‌ ఇండియా లెవెల్‌లో తీస్తున్న ఈ సినిమా కథాంశం సోషియో ఫాంటసీ అంటున్నారు. ఇందులో బాలయ్య శ్రీకృష్ణుడి పాత్ర పోషించబోతున్నట్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారంటున్నారు. అయితే తమ్ముడు పుట్టిన రోజు, తొలి సినిమా పోస్టర్‌ రిలీజ్‌ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన ఎన్టీఆర్‌.. తమ్ముడి సినిమాలో నటించే విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు. నందమూరి కుటుంబంతో జూనియర్‌కు గ్యాప్‌ ఉందనే ప్రచారం నడుమ… మోక్షజ్ఞ సినీ కెరీర్‌ అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో గ్రీటింగ్స్‌ చెప్పారు జూనియర్‌. ఈ విధంగా తమ్ముడిపై తన అనురాగం చాటుకున్న జూనియర్‌.. సినిమాలో కనిపిస్తారో లేదో అన్నదే సస్పెన్స్‌గా మారింది. ఏదైనా సరే ఇండస్ట్రీ టాక్‌ ప్రకారం మోక్షజ్ఞ సినిమాలో బాలయ్యతోపాటు జూనియర్‌ ఉంటారనే అంటున్నారు.

Also Read: టాలీవుడ్ హీరో నితిన్, షాలిని దంపతులకు పండంటి మగబిడ్డ