హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ

హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్న పిటిషనర్.. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు.

హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ

Ganesh Immersion In Hussain Sagar : హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని పిటిషనర్ కోరారు. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు పిటిషనర్. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్న పిటిషనర్.. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు. ఈ పిటిషన్ పై రేపు వాదనలు వింటామంది న్యాయస్థానం.

Also Read : హైడ్రా మరో సంచలనం.. సామాన్యులపైనా కొరడా..

హైదరాబాద్ నగరంలో గణేశ్ ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను హుస్సేన్ సాగర్ లో నిర్వహిస్తారు. కానీ, హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం వేడుకలు జరపకూడదంటూ గత కొంత కాలంగా హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో కాలుష్యం అవుతుందని, దీని నుంచి చెరువులను, హుస్సేన్ సాగర్ ను పరిరక్షించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను వేసి హుస్సేన్ సాగర్ ను పూర్తిగా కలుషితం చేస్తున్నారని, హుస్సేన్ సాగర్ ను పరిరక్షించాలని హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టులో గతంలోనే చాలా క్లియర్ గా చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కూడుకున్న విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడానికి వీలు లేదని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. నిమజ్జన వేడుకలు జరుపుతూనే ఉన్నారని మరోసారి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.