Jiiva : కోలీవుడ్ స్టార్ హీరో జీవాకు యాక్సిడెంట్.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నుజ్జునుజ్జు..
కోలీవుడ్ స్టార్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు.
Kollywood Hero Jiiva : కోలీవుడ్ స్టార్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఆయన తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీ కొట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అయితే.. ఈ ప్రమాదం నుంచి జీవాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
బుధవారం జీవా తన కుటుంబంతో కలిసి సేలం నుంచి చెన్నైకి కారులో బయలు దేరారు. కళ్లకురిచ్చి జిల్లా కనియమూరు బస్టాప్ సమీపంలో జీవా కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా బైక్ రావడంతో దాన్ని తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Sai Durgha Tej : అమ్మ అనాథాశ్రమానికి మెగా మేనల్లుడి విరాళం..
జీవా కారు ప్రమాదానికి గురి అయ్యాడని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో జీవా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘రంగం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ‘యాత్ర-2’, 1983 ప్రపంచకప్ నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కించిన మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో అలరించారు.
Jabardasth New Judge : జబర్దస్త్‌కి కొత్త జడ్జి.. ఫస్ట్ ఎపిసోడ్ లోనే పంచులతో హవా..
#BREAKING | கார் விபத்தில் சிக்கிய நடிகர் ஜீவா!#SunNews | #Jiiva | #CarAccident | #Kallakurichi | @JiivaOfficial pic.twitter.com/yW2JWEllID
— Sun News (@sunnewstamil) September 11, 2024