iPhone 16 Series Launch : ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ కావాలా? ఈ నెల 13 నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.. ధరల వివరాలివే..!

iPhone 16 Series Launch : మీరు ఐఫోన్ 16 సిరీస్‌ కోసం చూస్తుంటే.. ఈ నెల 13న రిమైండర్‌ని సెట్ చేసుకోండి. ఆపిల్ స్టోర్, ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను విజిట్ చేయొచ్చు.

iPhone 16 Series Launch : ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ కావాలా? ఈ నెల 13 నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.. ధరల వివరాలివే..!

iPhone 16 Series will be available for pre-booking on September 13 ( Image Source : Google )

iPhone 16 Series Launch : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఆపిల్ కొత్త ఎ18 సిరీస్ ప్రాసెసర్‌లు ఆపిల్ ఇంటిలిజెన్స్‌ ఫీచర్లతో వస్తాయి. ఆపిల్ సొంత ఏఐ ప్లాట్‌ఫారమ్ భారత మార్కెట్లో ఐఫోన్16 సిరీస్ ప్రారంభ ధర రూ.79,900కు అందిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు సెప్టెంబర్ 13 సాయంత్రం 5:30పీఎమ్ నుంచి లేటెస్ట్ మోడళ్లను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

Read Also : iPhone 16 Upgrade : ఐఫోన్ 16కి అప్‌గ్రేడ్ చేస్తున్నారా? మీ పాత ఐఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి..!

మీరు ఐఫోన్ 16 సిరీస్‌ కోసం చూస్తుంటే.. ఈ నెల 13న రిమైండర్‌ని సెట్ చేసుకోండి. మీరు ఆపిల్ స్టోర్, ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను విజిట్ చేయొచ్చు. అలాగే వివిధ రిటైల్ స్టోర్లు ముందుగా బుక్ చేసుకోవాలంటే.. కొత్త ఐఫోన్‌ల అధికారిక సేల్ సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఐఫోన్ 16 సిరీస్ ఆన్‌లైన్‌లో, ఫిజికల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్ ధరలివే :

  • ఐఫోన్ 16 : రూ. 79,900 నుంచి ప్రారంభం
  • ఐఫోన్ 16 ప్లస్ : రూ. 89,900 నుంచి ప్రారంభం
  • ఐఫోన్ 16 ప్రో : రూ. 1,19,900 నుంచి ప్రారంభం
  • ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ : రూ. 1,44,900 నుంచి ప్రారంభం

ఆపిల్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లతో చేసిన అర్హత గల కొనుగోళ్లపై రూ. 5వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ప్రారంభ కొనుగోలుదారులకు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 సిరీస్ గత ఐఫోన్ 15 సిరీస్ కన్నా అనేక కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్స్ అందించనుంది.

డిజైన్ డిస్‌ప్లే :
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లు క్యాప్సూల్ ఆకారపు ఐలాండ్, డ్యూయల్-కెమెరా సెటప్‌తో కూడిన ఐఫోన్ ఎక్స్ గుర్తుకు తెచ్చే రీవాంప్డ్ డిజైన్‌ను అందిస్తాయి. ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ 16 ప్లస్ పెద్ద 6.7-అంగుళాల స్క్రీన్‌ను అందిస్తుంది. మరోవైపు, ఐఫోన్ 16 ప్రో, ప్రో మాక్స్ ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే డిజైన్‌ కలిగి ఉంటాయి. ఐఫోన్ ప్రో మోడల్ 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఐఫోన్ ప్రో మాక్స్ భారీ 6.9-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. రెండు ప్రో మోడల్స్‌లో సన్నని ఎడ్జెస్, 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మొత్తం బ్లాక్, వైట్, గులాబీ, టీల్, అల్ట్రామెరైన్ అనే 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ ప్రో మోడల్స్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, కొత్త డెజర్ట్ టైటానియం అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

పర్పార్మెన్స్ :
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడల్‌లు అడ్వాన్స్‌డ్ ఎ18 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. మెరుగైన పర్ఫార్మెన్స్, సామర్థ్యం కోసం సెకండ్ జనరేషన్ 3ఎన్ఎమ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఐఫోన్ ప్రో మోడల్‌లు ఎ18 ప్రో చిప్‌సెట్‌కి అప్‌గ్రేడ్ అవుతాయి.

కెమెరాలు :
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 48ఎంపీ ఫ్యూజన్ ప్రైవరీ కెమెరాతో వస్తాయి. లైట్ ఫోటోగ్రఫీ కోసం 48ఎంపీ, 12ఎంపీ ఫొటోలతో 24ఎంపీ ఇమేజ్‌గా, 2ఎక్స్ టెలిఫోటో జూమ్, మెరుగైన అప్రెచర్ వేగవంతమైన ఎఫ్/1.6 కలిగి ఉంటాయి. ఐఫోన్ 16 సిరీస్ ప్రో మోడల్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తాయి.

ఇందులో కొత్త 48ఎంపీ ఫ్యూజన్ కెమెరా రెండో జనరేషన్ క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో సహా 48ఎంపీ ప్రోరా, హెచ్ఈఐఎఫ్ ఫొటోలలో జీరో షట్టర్ లాగ్‌ అనుమతిస్తుంది. ఈ మోడల్‌లు 4కె120 వీడియో క్యాప్చర్‌కు సపోర్టు చేస్తుంది. ఆటోఫోకస్‌తో 48ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటాయి. 5ఎక్స్ టెలిఫోటో లెన్స్‌తో కూడిన 12ఎంపీ సెన్సార్, జూమ్ సామర్థ్యాలకు 120ఎమ్ఎమ్ ఫోకల్ లెంగ్త్‌ను కలిగి ఉంటాయి.

కొత్త బటన్‌లు, ఆపిల్ ఇంటెలిజెన్స్ :
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో కొత్త కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్‌ను కూడా ప్రవేశపెట్టింది. కెమెరా ఫంక్షన్‌లతో ఇంటరాక్ట్ అయ్యే కంట్రోలింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా సులభంగా యాక్సస్ చేయొచ్చు.

Read Also : Vivo T3 Ultra Launch : అదిరే ఫీచర్లతో వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ చూశారా? భారత్‌లో ధర ఎంతో తెలుసా?