Banana Crop Cultivation : ప్రయోగాత్మకంగా అరటి సాగు.. లాభాలు అధికం అంటున్న రైతు

ఎకరాకు కనీసంగా 30టన్నుల దిగుబడి వచ్చే విధంగా ఈ తోట వుంది. ఇటీవలికాలంలో వ్యాపారులు అరటిని గెలతోపాటు కాకుండా తోటవద్దే గెలనుంచి హాస్తాలను వేరుచేసి కిలోల చొప్పున కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం వుండదు.

Banana Crop Cultivation : ప్రయోగాత్మకంగా అరటి సాగు.. లాభాలు అధికం అంటున్న రైతు

Banana Crop Cultivation

Banana Crop Cultivation : రైతుల ఆలోచనలు మారుతున్నాయి. సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, డిమాండ్‌ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోపాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానాన్ని ఎంచుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు 5 ఎకరాల్లో అరటిని సాగుచేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

READ ALSO : Banana Crop Farming : 5 ఎకరాల అరటి సాగుతో.. రూ. 25 లక్షల ఆదాయం

పొడవాటి అరటి గెలలు, ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో, ఎంతో చూడ ముచ్చటగా ఉంది కదూ ఈ క్షేత్రం. ప్రతి గెలలోను 10 హాస్తాలకు తగ్గకుండా వున్నాయి . మరికొద్ది రోజుల్లో కోతకు రానున్న ఈ తోట, నిర్మల్ జిల్లా, బైంసా మండలం, హజ్గుల్ గ్రామానికి చెందిన రైతు ప్రకాష్ ది. గతంలో కూరగాయల సాగుచేసే ఈయన , ఈ సారి ప్రయోగాత్మకంగా 5 ఎకరాల్లో అరటిని సాగుచేశారు. పంట దిగుబడి బాగా వచ్చింది. తోటమీదే అరటిని వ్యాపారులు కొనుగోలు చేశారు. కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లిస్తూ.. అరటి గెలలను వారే కోత కోసుకుంటున్నారు. దీంతో రైతుకు కూలీ , రవాణ ఖర్చులు మిగులుతున్నట్లు చెప్తున్నాడు.

READ ALSO : Banana Plantation : అరటిసాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు

ఎకరాకు కనీసంగా 30టన్నుల దిగుబడి వచ్చే విధంగా ఈ తోట వుంది. ఇటీవలికాలంలో వ్యాపారులు అరటిని గెలతోపాటు కాకుండా తోటవద్దే గెలనుంచి హాస్తాలను వేరుచేసి కిలోల చొప్పున కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం వుండదు. కిలోకు 10 రూపాయల ధర పలికినా ఈ రైతు ఎకరాకు లక్ష రూపాయల ఖర్చుపోను 2 లక్షల నికరలాభం సాధించే వీలుంది.

READ ALSO : Banana Cultivation : అరటిసాగులో అనువైన రకాలు, పిలకల ఎంపిక.. మొక్కల నాటులో సమగ్ర యాజమాన్యం

ఇతర పంటలతో పోలిస్తే అరటిలో ఆదాయం ఆశాజనకం. కానీ సున్నితమైన పంట కనుక, ప్రకృతి వైపరిత్యాలతో రిస్కు అధికం. వీటిన్నింటినీ అధిగమిస్తూ అరటిసాగులో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్నారు రైతు ప్రకాష్.