Shigella Bacteria : కేరళలో మరోసారి వెలుగు చూసిన షిగెల్లా బ్యాక్టీరియా కేసు

కేరళలో మరోసారి షిగెల్లా బ్యాక్టీరియా కేసు వెలుగు చూసింది. కోజికోడ్ లోని ఎరంజికల్ లో ఆరేళ్ల చిన్నారికి షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. తీవ్ర విరేచనాలు కావటంతో చిన్నారిని పుతియప్ప ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Shigella Bacteria : కేరళలో మరోసారి వెలుగు చూసిన షిగెల్లా బ్యాక్టీరియా కేసు

Shigella Bacteria

Shigella Bacteria :  కేరళలో మరోసారి షిగెల్లా బ్యాక్టీరియా కేసు వెలుగు చూసింది. కోజికోడ్ లోని ఎరంజికల్ లో ఆరేళ్ల చిన్నారికి షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. తీవ్ర విరేచనాలు కావటంతో చిన్నారిని పుతియప్ప ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిన్నారి పేగుల్లో షిగెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వీరి ఇంటి సమీపంలోని మరో చిన్నారిలోనూ వ్యాధిలక్షణాలు కనిపించాయని ఇద్దరి ఆరోగ్య పరిస్ధితి   నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇది సాధారణంగా చిన్నపిల్లలలో వస్తుందని…. షిగెల్లా బ్యాక్టీరియా కలుషితమైన నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. ఒక్కోసారి జ్వరం వస్తుంది. అతిసార వ్యాధిలోకి దించకుండా రోగికి తీవ్రమైన కడుపునొప్పి వాంతులు వస్తాయి. కనుక ఇంటి పరిసరాలలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని పరిశుభ్రమైన నీరు తాగుతూ, ఆహార పదార్ధాలపై మూతలు ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు.

నివారణ చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలోని 100 ఇళ్లలోని బావులలో అధికారులు క్లోరినేషన్ చేశారు. జ్వరం, డయేరియా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. 2020 డిసెంబర్‌లో కేరళలో షిగెల్లా తొలికేసు నమోదయ్యింది. మళ్లీ ఇప్పుడు మరోసారి షిగెల్లా కేసు బయటపడింది.

Also Read : Corona Vaccine : 5-12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. నిర్ణయంపై ఉత్కంఠ