నవంబర్ 24న జగనన్నతోడు : చిన్న వ్యాపారస్తులకు వడ్డీ లేకుండా రూ. 10 వేల లోన్

  • Published By: madhu ,Published On : November 5, 2020 / 03:55 PM IST
నవంబర్ 24న జగనన్నతోడు : చిన్న వ్యాపారస్తులకు వడ్డీ లేకుండా రూ. 10 వేల లోన్

Jagananna Thodu Scheme : జగనన్న తోడు కార్యక్రమం 2020, నవంబర్ 24వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమౌతుందని ఏపీ మంత్రి కన్నబాబు వెల్లడించారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు.



తోపుడు బండ్లపై వ్యాపారం చేసే వారు, చిన్న చిన్న వ్యాపారం చేసే వారికి వడ్డీ లేకుండా రూ. 10 వేల రుణం ఇవ్వడానికి (జగనన్న తోడు పథకం) కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సుమారు వేయి కోట్ల రూపాయలు పథకం కింద ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అర్హత గుర్తింపు పొందిన వారికి ఐడెంటిడీ కార్డు ఇచ్చి..వీరికి రుణ సదుపాయం కల్పించాలని అనుకున్నామన్నారు.



ఇప్పటి వరకు 9 లక్షల 18 వేల మంది నమోదయ్యారని తెలిపారు. బ్యాంకుల ద్వారా..ఆల్ రెడీ, సుమారు 5 లక్షల 60 వేల మందికి టైప్ చేశామని, నవంబర్ 24వ తేదీన జగనన్న తోడు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లబ్దిదారులను గుర్తించామని, ఇంకా ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చన్నారు.



కరోనా కాలంలో లాక్ డౌన్ విధించడంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు తీవ్రంగా నష్టపోయారు. వ్యాపారం చేయాలంటే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నంగా తయారైంది. ఈ క్రమంలో వీరిని ఆదుకొనేందుకు ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.



https://10tv.in/cm-ys-jagan-launches-jagananna-ysr-badugu-vikasam/
ఇప్పటికే ఎంతో మంది వీధి వ్యాపారులుగా రిజిస్టర్ చేసుకున్నారు. గుర్తింపు కార్డులను కూడా పంపిణీ చేశారు. వీరందరికీ ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఒక్కొక్కరికి రూ.10 వేల రుణాన్ని సత్వరమే ఎలాంటి ష్యూరిటీ లేకుండా అందించాలని బ్యాంకర్లకు ప్రభుత్వం సూచించింది.

అర్హులు ఎవరంటే : –
రోడ్ల వెంబడి పండ్లు, కూరగాయలు, పూలు, చిన్నపిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు అమ్మేవారు.
డ్రై ఫ్రూట్స్, స్నాక్స్, పచ్చళ్లు, ఆహార ముడి పదార్థాలు, గింజలు, కుండలను విక్రయించే వారు.
ఫాస్ట్‌ఫుడ్, పానీపూరి, సమోసా, కర్రీ పాయింట్స్, చేపలు, కోడిగుడ్లు, చికెన్, మటన్‌ విక్రయదారులు.



హ్యాండీక్రాఫ్ట్‌ ఉత్పత్తులు, కాస్మోటిక్స్, సీజనల్‌ ఐటమ్స్‌ అమ్మేవారు.
లెదర్‌ ఉత్పత్తులు (బూట్లు, బెల్టులు, పర్సులు, బ్యాగులు) సింథటిక్‌ బ్యాగ్‌లు, పోస్టర్లు, పొటోఫ్రేమ్‌లు.
ఫ్యాన్సీ వస్తువులు, పాన్, బీడీలు, పాలు, పాల ఉత్పత్తులు, టీ, కాఫీ అమ్మేవారు.



పూజా సామగ్రి, ఇస్త్రీ, రోడ్‌ సైడ్‌ టైలరింగ్, ఓపెన్‌ బార్బర్, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, కొవ్వొత్తులు.
ఫ్రూట్‌ జ్యూస్, కూల్‌ డ్రింక్స్, స్టేషనరీ, సైకిల్‌ రిపేర్, మెకానిక్, సిలిండర్‌ రిపేరు.
హెల్మెట్లు, కొబ్బరిబొండాలు విక్రయించే వారు.
దుస్తులు, మాస్కులు అమ్మేవారు, తదితర విక్రయ దారులను వీధి వ్యాపారులుగా ప్రభుత్వం గుర్తించింది.