ఏపీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి : త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ – చిరు

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 10:16 AM IST
ఏపీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి : త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ – చిరు

సినిమా రంగం మళ్లా కళకళలాడనుంది. షూటింగ్ లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఇక్కడ షూటింగ్ లు స్టార్ట్ కానున్నాయి. ఏపీలో కూడా సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు 2020, మే 24వ తేదీ ఆదివారం జీవో జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోను సమర్థిస్తూ…మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలియచేశారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారానికై…త్వరలోనే ఇండస్ట్రీ పెద్దలతో కలిసి…సీఎం జగన్ ను కలుస్తామంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. లాక్ డౌన్ తర్వాత..ఈ భేటీ ఉంటుందని ఆయన వెల్లడించారు. 

సినీ, టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్ లకు అనుమతినిచ్చింది. గతంలో నిర్ణయించిన ఫీజులను కషన్ డిపాజిట్లను కార్పొరేషన్ కు చెల్లించి..షూటింగ్ అయిపోయిన తర్వాత..వాటిని తిరిగి ఇవ్వనుంది. ఇందుకు మూడు కేటగిరిలుగా విభజించింది. 

కేటగిరి 1 : – వివిధ మ్యూజియం, పాఠశాలలు, కాలేజీలు, బిల్డింగ్స్ లలో అనుమతి. పట్టణాభివృద్ధి సంస్థ పార్కులు, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న పార్కుల్లో షూటింగ్ లు చేసుకోవచ్చు. పట్టణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న పార్కుల్లో షూటింగ్ కు అనుమతి. 

కేటగిరి 2 : – అన్న ఆలయాలు, విశాఖ, తిరుపతిలో ఉన్న జూ పార్కులు, జిల్లా కేంద్రంలోని పాఠశాలలు, కాలేజీలు, విజయవాడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో షూటింగ్, APTDC ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు, ఉద్యానవనాల్లో షూటింగ్ లకు అనుమతి. 

కేటగిరి 3 : – APTDC, R&B, ఇరిగేషన్ శాఖల లోకేషన్స్ షూటింగ్ కు అనుమతి. మున్సిపల్ పరిధిలోని రోడ్లు, పార్కులు, బీచ్ లు, అలిపిరి గార్డెన్స్ తో సహా అన్ని పార్కుల్లో అనుమతి.

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.