33వేల మంది వలస కార్మికుల కోసం ఏపీ నుంచి 22 స్పెషల్ రైళ్లు

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 03:02 PM IST
33వేల మంది వలస కార్మికుల కోసం ఏపీ నుంచి 22 స్పెషల్ రైళ్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 33వేల మంది కార్మికులను 22శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా సొంత గ్రామాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటుంది. వారంలోగా ప్రక్రియ పూర్తి కావాలని కాలి బాటన వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం 31రైళ్లను ఏర్పాటు చేసి ఉంచింది. 

బీహార్‌కు 9, ఒడిశాకు 5, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ లకు ఒక్కోదానికి నాలుగు చొప్పున, మహారాష్ట్రకు 3, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ కు ఒకటి చొప్పున కేటాయించి పలు ప్రాంతాల నుంచి 39వేల మంది కార్మికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. 

మే17న 7వేల 500మందిని తరలించడానికి 5రైళ్లు నడుపుతున్నాం. మరో 22శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసి 33వేల మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చే ప్రయత్నంలో ఉన్నాం. ఇంటికి వెళ్లాల్సిన అవసరాన్ని ప్రాధాన్యతను బట్టి ప్రయాణికులను పంపిస్తామని అధికారులు అంటున్నారు. 

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సులు కూడా ఏర్పాటు చేసి వలస కార్మికులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని పోలీస్ చెక్ పోస్టులలో రెవెన్యూ డిపార్ట్ మెంట్ తో చెకింగ్ లు నిర్వహిస్తున్నాం. వలస కార్మికులను శ్రామిక్ రైళ్ల ద్వారా పంపుతామని మాటిస్తున్నాం. నేషనల్ హైవే మీద 79 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఆహారం, నీరు సప్లై చేస్తున్నారు. 

రోడ్లు, రైల్వే ట్రాకుల మీద వెళ్లే వారికి ఆహారం, వసతి ఏర్పాటు చేస్తాం. వారి సొంతూళ్లకు వెళ్లేంత వరకూ చూసుకుంటాం. హైవేలపై బ్యానర్లు ఉంచాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. ఒడియా, హిందీ భాషల్లో వలస కార్మికులకు అర్థమయ్యే రీతిలో పెడుతున్నాం. ఓ సారి రిలీఫ్ సెంటర్లకు వెళితే వారి పేర్లు రిజిష్ట్రర్ చేసుకుని ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సొంత జిల్లాలకు పంపిస్తాం. 

ఈ మూడు రోజుల్లో 4వేల 661మంది కార్మికులు నడిచి వెళ్తుండగా పలు చెక్ పోస్టుల ద్వారా ఆపి 62రిలీఫ్ సెంటర్లకు పంపాం. వారిలో 465మంది రాష్ట్రంలోని కొద్ది ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిసింది. మిగిలిన 4వేల 176మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.