AP High court : జీవో నెంబర్ 1పై సస్పెన్షన్ విధించిన హైకోర్టు .. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
జీవో నెంబర్ 1పై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారించిన హైకోర్టు సస్పెన్షన్ విధించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Andhra pradesh high court suspends GO Nomber 1 till 23rd january
AP High court go-nomber-1 : జీవో నెంబర్ 1పై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారించిన హైకోర్టు సస్పెన్షన్ విధించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లంచ్ మోషన్ పిటీషన్ పై విచారించిన హైకోర్టు జీవో నెంబర్ 1పై జనవరి 23 వరకు సస్పెన్షన్ విధించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. ఈ కేసు విచారణపై సస్పన్షన్ విధించటంతో జగన్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చింది. ఈ జీవోను సవాలు చేస్తూ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్దంగా ఉందని పేర్కొంది. జీవో నెంబర్ 1పై ఈ నెల 23 వరకు సస్పెన్షన్ విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ..తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
కాగా.. జీవో నెంబర్ 1 పై రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పిస్తూ..ఈ పిల్ దాఖలు చేయటంపై తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలను అడ్డుకోవటానికే ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించగా..దీనిపై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సమాధానమిస్తే ఇవన్నీ రాజకీయపరంగా చేసే వాదనలేనని వాదించారు. విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించిన పిటిషన్లపై విచారించవద్దని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. అయినా కోర్టు మాత్రం జీవో నెంబర్ 1పై ఈ నెల 23 వరకు సస్పెన్షన్ విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ..తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి వివరాలు కోర్టులు అందజేస్తుందో వేచి చూడాలి.