Amaravati : శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

అమ‌రావ‌తిలో తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నేటి నుండి 9వ తేదీ వ‌రకు జ‌రుగ‌ుతాయి.

Amaravati : శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Ttd Amaravati Sri Vari Temple

Amaravati :  అమ‌రావ‌తిలో తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నేటి నుండి 9వ తేదీ వ‌రకు జ‌రుగ‌ుతాయి. ఇందులో భాగంగా నిన్న మే 4వ తేదీ శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జరిగింది. ముందుగా శోభాయాత్ర జ‌రిగింది. ఆ త‌రువాత పుణ్యాహ‌వ‌చ‌నం, ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ ఘ‌ట్టాలు చేప‌ట్టారు.

రోజువారీ కార్య‌క్ర‌మాలు
జూన్ 5న ఉద‌యం పుణ్యాహ‌వ‌చ‌నం, పంచ‌గ‌వ్యాధివాసం చేప‌డ‌తారు. సాయంత్రం హోమాలు నిర్వ‌హిస్తారు.
జూన్ 6న ఉద‌యం న‌వ క‌ల‌శ స్న‌ప‌న క్షీరాధివాసం, సాయంత్రం హోమాలు, యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.
జూన్ 7న ఉద‌యం చ‌తుర్ధ‌శ క‌ల‌శ స్న‌ప‌న జ‌లాధివాసం, సాయంత్రం యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

జూన్ 8న ఉద‌యం 10.45 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విమాన క‌ల‌శ స్థాప‌న‌, గోపుర క‌ల‌శ స్థాప‌న‌, విగ్ర‌హ స్థాప‌న, మ‌ధ్యాహ్నం స్న‌ప‌న తిరుమంజ‌నం చేప‌డ‌తారు. సాయంత్రం మ‌హాశాంతి తిరుమంజ‌నం, రాత్రి యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.
జూన్ 9న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, విమాన గోపుర క‌ల‌శ ఆవాహ‌న, ఉద‌యం గం.7.30 నుండి గం.8.30 గంట‌ల వ‌ర‌కు మిథున ల‌గ్నంలో ప్రాణ ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఉద‌యం గం.10.30 నుండి భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం గం.3.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు శాంతి క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌ుతుంది.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ గుణ‌భూష‌ణ్‌రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, ఎఈవో శ్రీ దొరస్వామి నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read : Admissions : ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులకు అడ్మిషన్లు